కాల్పులకు భయపడం, ఆంధ్రా పాలకులను తలపిస్తున్నారు: కోదండరాం
పాలకులు జరిపే కాల్పులకు భయపడే సంస్కృతి తెలంగాణలో పుట్టిన చిన్నపిల్లోడికి కూడా లేదని, అలా ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వాళ్లమే కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
వరంగల్: పాలకులు జరిపే కాల్పులకు భయపడే సంస్కృతి తెలంగాణలో పుట్టిన చిన్నపిల్లోడికి కూడా లేదని, అలా ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వాళ్లమే కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని సెమినార్ హాల్‌లో ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జరిగే నిరద్యోగుల నిరసన ర్యాలీకి మద్దతుగా కెయు విద్యార్థి ఆధ్వర్యంలో సన్నాహక సదస్సు పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. నర్సింహారావు అధ్యక్షతన జరిగింది.
సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరితే పాలకులు కాల్పుల ప్రస్తావన తీసుకరావడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యార్థి, యువతకు ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగ నియామకాలు చేపడుతామని హామినిస్తేనే టిఆర్‌ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టామని, ఇచ్చిన హామీలన్నింని గాలకొదిలి కల్లబొల్లి ముచ్చట్లు చెప్పితే వినిపంచుకునే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు.
2014సంవత్సరంలోనే అసెంబ్లీ సాక్షిగా (బడ్టెజ్ సమావేశాలు) 1 లక్ష 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, నేటికి 30వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారని, ప్రస్తుతం రాష్ట్రంలో 1 లక్ష 52 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం 15 వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిపికేషన్లు జారీ చేసి విద్యార్థి, నిరోద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.

ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పాకులాడకుండా ఉద్యోగాల కల్పనకు ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. రెండున్నరేళ్లు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తుందని ఓపికతో ఆశించామని ఇక ఓపిక పట్టే పరిస్థితి యువతకు లేదని ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపట్ల తెలంగాణ పౌర సమాజం వ్యక్తం చేస్తున్న నిరసనను ప్రకటించడం కనీస కర్తవ్యంగా టీజెఎసి అభిప్రాయపడిందని అందుకే ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో 'మా కొలువులు మాక్కావాలి' అని తెలంగాణ నిరద్యోగుల నిరసన ర్యాలీని చేపడుతుందని తెలిపారు.
ర్యాలీ అనుమతికి డిజిపి ఆఫీస్‌కు వెళితే గత ఆంధ్ర పాలకులు హయాంలో చెప్పిన మాటల్నే నేటి తెలంగాణ పోలీసులు చెబుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఖాళీలన్నిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ''జాబ్ క్యాలెండర్'' రూపొందించి అమలు పరచాలని, ప్రైవేటు రంగంలోని ఉద్యోగ నియమకాలలో స్థానిక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని, డిఎప్‌సిలను వెంటనే ప్రకటించి మాతృభాషలో చదివిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు.
24న మహబూబాబాద్ జిల్లాకు సీఎం
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన మమబూబాబాద్ జిల్లా కురవి జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నట్లు డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ తెలిపారు. హైదరాబాద్‌లో గిరిజన భవన్ నిర్మాణానికి భూమి క్లియరెన్స్ ఇప్పించినందుకు మంగళవారం రాత్రి ఎమ్మెల్యే రెడ్యా, ఆయన కూతురు, మాజీ ఎమ్మెల్యే కవిత సీఎంకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్రమంలోనే తమ ప్రాంతంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే కురవి జాతరకు రావాలని రెడ్యా, కవితలు సీఎంను ఆహ్వానించారు. ఏడాదిన్నర క్రితం కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు సమర్పిస్తామని సీఎం మొక్కుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఆయన 24న ఉదయం 11 గంటలకు వస్తానని ఒప్పుకున్నట్లు రెడ్యా తెలిపారు. వారి వెంట మరిపెడ కోఆప్షన్ సభ్యుడు అయూబ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications