కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి: కోదండరాం, ‘సిగ్గేస్తోంది’
ఆంధ్రా పాలకులను మట్టి కరిపించినట్లే ప్రజా సమస్యలను పరిష్కరించని ఈ ప్రభుత్వానికీ బుద్ధి చెప్పాలని కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా పాలకులను మట్టి కరిపించినట్లే ప్రజా సమస్యలను పరిష్కరించని ఈ ప్రభుత్వానికీ బుద్ధి చెప్పాలని కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం తెలంగాణ లెక్చరర్ల ఫోరం(టీఎల్‌ఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, కార్పొరేట్, ప్రైవేటు అధ్యాపకుల భద్రత, వారి సమస్యలు పరిష్కారమయ్యే సూచనలే కనిపించడం లేదని విమర్శించారు.

మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి తరిమికొట్టాలన్నారు. కేసీఆర్ నగదు రహిత లావాదేవీల విషయంలో ప్లేటు ఫిరాయించారని విమర్శించారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎం కేసీఆర్, ఎంపీ కవిత కాళ్ల వద్ద మోకరిల్లడం వంటి ఘటనలు చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. కేసీఆర్ పాలన భూతవైద్యం తరహాలో సాగుతోందని టిడిపి ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.












Click it and Unblock the Notifications