ఫలితం లేదు, డిజిపిని కలుస్తాం: నాయిని నర్సింహా రెడ్డిని కలిసిన కోదండరాం:
తెలంగాణలో ఆరో దశ స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన హోంమంత్రి నాయిని నర్సింహా
హైదరాబాద్: తెలంగాణలో ఆరో దశ స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని జేఏసీ బృందంతో వెళ్లి కలిశారు.

నల్గొండ జిల్లాలో స్ఫూర్తియాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని నాయినికి ఫిర్యాదు చేశారు. తమ యాత్రకు అనుమతి ఇవ్వకుండా జేఏసీ ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తెలిపారు.

అయితే నాయిని నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని, అనుమతి అంశంపై డీజీపీతో మాట్లాడతాని కోదండరాం చెప్పారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము మాత్రం యాత్రను కొనసాగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications