అసంతృప్తికి గురయ్యా: కేసీఆర్‌పై కోదండరాం మరోసారి, దీని పైనా ఫైట్
గురుకుల ఉద్యోగ ప్రకటనతో అభ్యర్థులు నిరాశకు గురయ్యారని, తాను కూడా అసంతృప్తికి లోనయ్యానని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేత కోదండరాం బుధవారం నాడు అన్నారు.
హైదరాబాద్: గురుకుల ఉద్యోగ ప్రకటనతో అభ్యర్థులు నిరాశకు గురయ్యారని, తాను కూడా అసంతృప్తికి లోనయ్యానని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేత కోదండరాం బుధవారం నాడు అన్నారు.
బీఎడ్ చేసినవారు నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారని చెప్పారు. ఈ ఉద్యోగ ప్రకటనతో కనీసం లక్షమందికి కూడా లాభం జరగలేదన్నారు. ఈ ప్రకటతో అభ్యర్థుకు న్యాయం జరగదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం సరైన ఉద్యోగ ప్రకటనే జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22న భారీ సంఖ్యలో నిరుద్యోగులతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం పైన ఆయన ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మల్లన్న సాగర్‌తో పాటు పలు సమస్యల పైన నిత్యం తెరాస ప్రభుత్వం పైన పోరాడుతున్నారు. ఉద్యోగాల విషయంలోను ఆయన కేసీఆర్ ప్రభుత్వానికి షాకిస్తున్నారు.












Click it and Unblock the Notifications