మూడు రోజులు బంధించి, కోల్‌కతా అమ్మాయిపై హైదరాబాదులో గ్యాంగ్ రేప్
నగరాన్ని చూద్దామని వచ్చిన కోల్‌కతా అమ్మాయిపై నలుగురు వ్యక్తులు హైదరాబాదు నగరంలోని అపార్టుమెంటులో బంధించి గ్యాంగ్ రేప్ చేశారు.
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని వెస్ట్ మారేడుపల్లిలో బెంగాలీ యువతిపై దారుణం జరిగింది. హైదరాబాద్ నగరం చూసేందుకు వచ్చిన కోల్ కతాకు చెందిన యువతిని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడు రోజుల బంధించి దుండగులు సామూహిక అత్యాచారం చేశారు.
కొరియోగ్రాఫర్ ప్రీత్ అలియస్ రాజ్‌వీర్‌సింగ్, అతడి ముగ్గురు స్నేహితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతిని అసభ్యంగా వీడియో తీసి మిత్రులకు షేర్ చేశారు. యువతి వారి నుంచి తప్పించుకొని ఎయిర్‌పోర్టు పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బీకాం విద్యార్థిని అయిన పశ్చిమ బెంగాల్ యువతికి విమానాశ్రయంలో పింకీ అనే మహిళ పరిచయమైంది. తనతో వస్తే హైదరాబాద్ నగరాన్ని తిరిగి చూపిస్తానని మాయమాటలు చెప్పి వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన అపార్టుమెంటుకు తీసుకుని వెళ్లింది.
అక్కడ ఆమె స్నేహితుడైన కొరియోగ్రాఫర్ ప్రీత్ సెర్గిల్ ఆమెను బంధించాడు. మొదటి రోజు ఆమెపై అతను రేప్ చేశాడు. మర్నాడు మతన స్నేహితులతో కూడా సామూహిక అత్యాచారం చేయించాడు.












Click it and Unblock the Notifications