వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో ఓటు ఎవరికి వెయ్యాలి? కేటీఆర్ కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్

|
Google Oneindia TeluguNews

మునుగోడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీల నాయకులు మాటల యుద్ధానికి తెరతీశారు. మునుగోడు ప్రజల మద్దతు కూడగట్టడం కోసం టిఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా మునుగోడులో పోటీ ఎవరిమధ్య అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ కు మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేసి రివర్స్ ఎటాక్ చేశారు.

మునుగోడులో పోటీ ఎవరి మధ్య..? ఆ ఫోటోతో షాకింగ్ పోస్ట్ పెట్టిన మంత్రి కేటీఆర్మునుగోడులో పోటీ ఎవరి మధ్య..? ఆ ఫోటోతో షాకింగ్ పోస్ట్ పెట్టిన మంత్రి కేటీఆర్

మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి? కోమటిరెడ్డి ఎటాక్

మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి? కోమటిరెడ్డి ఎటాక్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేసిన ట్వీట్ లో మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి అంటూ ప్రశ్నించారు. పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొనుక్కున్న టిఆర్ఎస్ పార్టీ కా? ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడదూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీ కా? లేక పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండే బిజెపి కా? అంటూ ఆసక్తికర పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్ పై రివర్స్ ఎటాక్ చేశారు. బిజెపి నైతికతతో కూడిన పార్టీ అని, టిఆర్ఎస్ పార్టీ అనైతికంగా ప్రవర్తిస్తున్న పార్టీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశారు.

 మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? కేటీఆర్ ట్వీట్

మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? కేటీఆర్ ట్వీట్


అంతకు ముందు మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ భూతాన్ని నల్గొండ బిడ్డలకు శాపంలా ఇచ్చిన కాంగ్రెస్, ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతిఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథ కు పైసా కూడా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ, ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టిఆర్ఎస్.. ఎవరి మధ్య పోటీ అంటూ కేటీఆర్ ఆశక్తికర ప్రశ్న వేశారు.

 టీఆర్ ఎస్ పార్టీ నైతికత లేని పార్టీ అని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

టీఆర్ ఎస్ పార్టీ నైతికత లేని పార్టీ అని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


మంత్రి కేటీఆర్ మునుగోడు లో పోటీ ఎవరిమధ్య అంటూ నల్గొండ ఫ్లోరోసిస్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తే, మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి అంటూ టిఆర్ఎస్ పార్టీ నైతికత లేని పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం తనదైన శైలిలో పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మునుగోడులో పీక్స్ కు చేరిన మాటల యుద్ధం ..

మునుగోడులో పీక్స్ కు చేరిన మాటల యుద్ధం ..

ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ మాత్రం నల్గొండ జిల్లాలో గతంలో ఫ్లోరోసిస్ రక్కసి బారినపడి ఎంతో మంది ప్రజలు మంచాలకు పరిమితమయ్యారని, కానీ ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించి ఫ్లోరోసిస్ నుండి ప్రజలను కాపాడారని, కాంగ్రెస్ పార్టీ, బిజెపి రెండూ నల్గొండ జిల్లా కోసం ఏమీ చేయలేక పోయానని చెబుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇక టిఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవడం కోసం బీజేపీ శ్రేణులు సైతం తమదైన శైలిలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి శూన్యంగా మార్చిన కెసిఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రచారం చేస్తున్నారు.

English summary
Komatireddy Rajgopal Reddy, who targeted the TRS party as an immoral party, gave a strong counter to KTR latest tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X