ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయీం డైరీలో 99శాతం తెరాస వాళ్లే, మంత్రితో లింక్స్: ఊగిపోయిన కోమటిరెడ్డి

|
Google Oneindia TeluguNews

అదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు అదిలాబాద్ జిల్లాలో జరిగిన రైతు గర్జన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నయీం తనను కూడా బెదిరించారని వ్యాఖ్యానించారు.

నయీంతో సంబంధాలు ఉన్న వారిలో 99 శాతం తెరాస నాయకులే ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సమయంలో నయీం మనుషులు తనను బెదిరించారన్నారు. తనను పోటీ నుంచి తప్పుకోమని ఒత్తిడి తెచ్చారన్నారు.

నువ్వు ఎమ్మెల్సీ పోటీ నుంచి విత్ డ్రా చేసుకుంటావా, లేక చంపేయమంటావా అని బెదిరించారన్నారు.
తమకు ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) పైన నమ్మకం లేదన్నారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నయీం డైరీ ద్వారా గత పదేళ్లుగా అతని వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు.

 Komatireddy Rajagopal Reddy alleges Nayeem gang threaten him

నయీం డైరీని చూస్తే తెరాస నాయకులకే ఎక్కువగా సంబంధాలు ఉన్నట్లు తేలుతుందన్నారు. 99 శాతం మంది తెరాస నాయకులే ఉన్నారని చెప్పారు. నయీం డైరీలో అందరి పేర్లు ఉన్నాయని, దానిని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే చాలామంది జాతకాలు బయటపడతాయన్నారు.

నయీంతో నల్గొండ జిల్లా ఓ మంత్రికి సంబంధాలు ఉన్నాయన్నారు. నయీంకు మిత్రుడు అన్నారు. అతనితో కలిసి సదరు మంత్రి వేల కోట్లు సంపాదించారన్నారు. నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అతనితో వ్యాపారాలు ఉన్నాయనే ఆరోపణలను కోమటిరెడ్డి కొట్టి పారేశారు.

తొలుత మాట్లాడటానికి నో.. ఆవేశంతో ఊగిపోయిన కోమటిరెడ్డి

రైతు గర్జన పేరుతో ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలుత మాట్లాడేందుకు అవకాశం రాలేదు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్‌లతో కలిసి మాట్లాడారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత అతను రెచ్చిపోయారు. తెరాసను టార్గెట్ చేశారు. తెరాసను ఇరుకున పెట్టేందుకు ఈ సభను ఉపయోగించుకున్నాడు.

గతంలోనే కిరణ్ రెడ్డికి చెప్పాం

నయీం ఆగడాల పైన గతంలోనే తాము అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ టీవీ ఛానల్‌తో అన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదన్నారు. తాము ఇంకా పట్టుబడితే నయీంకు చెప్పి తమను హత్య చేయించేవారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ మండలి సమావేశాలు జరిగేటప్పుడు హైదరాబాదులో లక్ష సీసీ కెమెరాలు పెడుతున్నామని మంత్రి చెబితే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదని, పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలో మాఫియా రాజ్యం కొనసాగుతోందని, తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తాను స్వయంగా చెప్పానన్నారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నయీం ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయని, వాటిని తాను పట్టించుకోలేదన్నారు. తెరాస నాయకులైతే నయీం ముఠాతో బెదిరించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలను అధికార పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది తెరాసలో చేరారన్నారు.

నయీం వల్ల లబ్ధి పొందిన వాళ్లలో 90 సాతం మంది తెరాసలో ఉన్నారని చెప్పారు. వాళ్ల దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయన్నారు. నయీంది ఎన్ కౌంటర్ కాదని, అతడిని ముందుగానే చంపేసి ఎక్కడికో తీసుకెళ్లి పారేశారని ఆరోపించారు.

అతడి దగ్గర ఉన్న ఆస్తులన్నింటిని ముందుగా లాక్కున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తేనే అన్నీ వెలుగు చూస్తాయన్నారు. దీనిపై కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. నయీంను హతమార్చినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని, అతడి వెనుక ఉన్న పెద్దలను బయటకు లాగాలన్నదే తన డిమాండ్ అన్నారు.

English summary
Congress MLA Komatireddy Rajagopal Reddy on Tuesday alleges that Nayeem gang threaten him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X