Munugodu By Election: నర్సన్న సాక్షిగా ప్రమాణం చేస్తా.. మీరు సిద్ధమా.. కేసీఆర్, కేటీఆర్‍కు రాజగోపాల్ రెడ్డి
"యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా నేను స్నానం చేసి తడి బట్టలతో బీజేపీకి అమ్ముడు పోలేదని నేను ప్రమాణం చేసేందుకు సిద్ధం. కేసీఆర్ నువ్వు & నీ కొడుకు (కేటీఆర్ ) తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా???" అని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడు నియోజకవర్గం లోని చండూరు లో రాజగోపాల్ రెడ్డి పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి.
చండూరులో రాత్రికి రాత్రి ఫోన్ పే తరహాలో, కాంట్రాక్ట్ పే అంటూ వెలసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. కాంట్రాక్ట్ పే ద్వారా 18 వేల కోట్ల ట్రాన్సాక్షన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ చండూరు మండలం లోని అన్ని చోట్ల వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోటో తో పాటు బిజెపి 18 వేల కోట్లు ట్రాన్సాక్షన్ ఐడి అని పేర్కొన్నారు.

అంతేకాదు 18 వేల కోట్ల కాంట్రాక్టు లతోపాటు 500 కోట్ల బోనస్ రివార్డును కూడా గెలుచుకున్నారు అంటూ పోస్టర్లు వెలిశాయి.
దీనిపై రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. తాను బీజేపీకి అమ్ముడుపోలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేస్తానని, కేసీఆర్, కేటీఆర్ కూడా తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. తనను ఎదుర్కొలేకనే ఇలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications