కాక రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్.. సంకట స్థితిలో కాంగ్రెస్!!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరింత సంకట స్థితిని తీసుకు వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై బహిష్కరణ వేటు వెయ్యాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై బహిష్కరణ వేటు వేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీలోని పలువురు నాయకులు భావిస్తున్నారు. ఎలాగైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బుజ్జగించి పార్టీలోనే కొనసాగేలా చూడాలని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. మిశ్రమ అభిప్రాయాలతో కోమటిరెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతుంది.

రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్... పార్టీకి జరిగే నష్టంపై కాంగ్రెస్ పార్టీ నేతల చర్చలు

రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్... పార్టీకి జరిగే నష్టంపై కాంగ్రెస్ పార్టీ నేతల చర్చలు

తాజాగా పార్టీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ను కలిసిన తర్వాత కోమటిరెడ్డి సోదరులను పోగొట్టుకోలేక రాజ్‌గోపాల్‌రెడ్డిని శాంతింపజేసి ఎలాగైనా పార్టీలో కొనసాగించాలని భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోతే దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ బలోపేతం అవ్వడానికి కారణంగా మారుతుందని ఇరువురు నేతలు అధిష్టానం వద్ద చెప్పినట్లుగా సమాచారం. అయితే ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మౌనం వహించినట్లుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డిని ఆపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పార్టీని వీడతారని కూడా అదే సమయంలో చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవటాన్ని సమర్ధిస్తున్న రేవంత్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవటాన్ని సమర్ధిస్తున్న రేవంత్ రెడ్డి

పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ బలహీనతలను బహిర్గతం చేస్తున్న కారణంగా ఆయనపై ముందు చర్య తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఆయనపై చర్యలు తీసుకోవటాన్ని రేవంత్ రెడ్డి సమర్ధిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పార్టీని మరింత బలహీనం చేసే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు.

కాంగ్రెస్ ను ఇబ్బందికర స్థితిలోకి నెట్టిన రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ను ఇబ్బందికర స్థితిలోకి నెట్టిన రాజగోపాల్ రెడ్డి


రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి, పార్టీని, నాయకులను బహిరంగంగా విమర్శించే నాయకులపై చర్యలు తీసుకోవడంలో పార్టీకి ఉన్న బలహీనతను బయటపెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఇతర అసంతృప్తుల మాదిరిగా రేవంత్ రెడ్డిని విమర్శించడంతో ఆగకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సోనియా మరియు రాహుల్ నాయకత్వాన్ని అసమర్థంగా మాట్లాడటం వంటి చర్యలతో రాజ్‌గోపాల్ రెడ్డి పార్టీని దెబ్బతీయడం రోజువారీ వ్యవహారంగా మార్చుకున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

చేరికలతో దూకుడు మీదున్న పార్టీకి రాజగోపాల్ రెడ్డి షాక్

చేరికలతో దూకుడు మీదున్న పార్టీకి రాజగోపాల్ రెడ్డి షాక్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చేరికలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని, రాజగోపాల్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు అన్న భావన పలువురు నేతలలో వ్యక్తమౌతుంది. చేరికలతో దూకుడు మీదున్న పార్టీకి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇవ్వటం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి విచారణలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ సమయంలో నల్గొండ జిల్లాలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి కక్కలేని, మింగలేని పరిస్థితికి కారణం అయ్యింది.

రాజగోపాల్ రెడ్డిపై బహిష్కరణ వేటు ఇష్టం లేకున్నా తప్పేలా లేదు

రాజగోపాల్ రెడ్డిపై బహిష్కరణ వేటు ఇష్టం లేకున్నా తప్పేలా లేదు


పార్టీ నుండి వెళ్లిపోయే నేతలు ఉంటారు కానీ, ఇంతగా పార్టీని డ్యామేజ్ చేసే వెళ్లే నేతలు ఎవరూ ఉండరు అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్ రెడ్డి పై బహిష్కరణ వేటు వేస్తే ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. కానీ రాజీనామా చేసి వెళ్ళిపోయే వరకు చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న తర్జనభర్జన లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్టీలోని మిగతా నాయకులకు హెచ్చరికగా ఉండేలా బహిష్కరణ వేటు వేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+