కేసీఆర్‌ని ఇరుకునపెట్టేందుకు ఛాన్స్, ఏకాకిని చేసారు: టిపిసిసిపై రాహుల్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు!
హైదరాబాద్/న్యూఢిల్లీ: తమపై అధికార టీఆర్ఎస్ పార్టీ వేటు వేసిందని, ఇలాంటి మంచి అవకాశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఉపయోగించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. వారు ఢిల్లీలో ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తమ శాసన సభ్యత్వాలను రద్దు చేసిన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సరిగ్గా స్పందించలేదని వారు మండిపడ్డారు. టీపీసీసీ స్పందన దారుణంగా ఉందన్నారు. రెండు రోజుల పాటు దీక్ష చేసి మమ అనిపించారన్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు మంచి అవకాశం వచ్చిందని, కానీ దానిని తమ పార్టీ నేతలు కాపాడుకోవడం లేదన్నారు. తమను ఏకాకులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications