Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సారీ చెప్పకుంటే, వదిలిపెట్ట: కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్, జగదీశ్ రెడ్డిపైనా..

హైదరాబాద్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ కేటీఆర్‌కు కోమటిరెడ్డి వార్నింగ్

ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ కేటీఆర్‌కు కోమటిరెడ్డి వార్నింగ్

కేటీఆర్ నీ భాష జాగ్రత్త.. నిజాయితీతో నిప్పులా బతికాను.. మీ కుటుంబంలా కమీషన్లతో కాదని వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తమ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన పలు మీడియా ఛానళ్లతో మాట్లాడటంతోపాటు ఓ ప్రకటనను విడుదల చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని.. తన జోలికివస్తే అవినీతి చిట్టా మొత్తం విప్పుతానంటూ హెచ్చరించారు. కోమటిరెడ్డి కాదు.. కోవర్టు బ్రదర్స్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చశారు. లేదంటే కేసీఆర్ కుటుంబం అవినీతిపై రోజూ మాట్లాడతానని అన్నారు.

 కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక

కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక

పోటీ రాజగోపాల్ రెడ్డితో అయితే.. తననెందుకు లాగుతున్నారంటూ మండిపడ్డారు. తనలాంటి ఉద్యమకారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేసి పోరాడానని, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంట్రాక్టుల కోసమే అన్నదమ్ములు ఆటలాడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను వెంకటరెడ్డి ఖండించారు. తాను ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రతి రోజూ కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై మాట్లాడతానన్నారు. కేటీఆర్‌లా తాను తండ్రి చాటుతో రాజకీయాల్లోకి రాలేదని వెంకటరెడ్డి అన్నారు.

జగదీశ్ రెడ్డి హంతకుడంటూ కోమటిరెడ్డి సంచలనం

జగదీశ్ రెడ్డి హంతకుడంటూ కోమటిరెడ్డి సంచలనం

మంత్రి జగదీశ్ రెడ్డిపైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగదీశ్ రెడ్డి ఓ హంతకుడని, ముగ్గురిని హత్య చేశాడని తెలిపారు. తన వద్ద వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లు కూడా ఉన్నాయన్నారు. బస్సు ఛార్జీలకు డబ్బుల్లేని జగదీశ్ రెడ్డి.. ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించుకున్నారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా వ్యాపారాలు చేశారా? ఎలా వేల కోట్లు ఆస్తులు వచ్చాయని నిలదీశారు. 70 ఎకరాల్లో మంత్రికి ఫాంహౌస్ ఉందన్నారు. పట్టుమని పది ఎకరాలు లేని కేటీఆర్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

కేటీఆర్ ఢిల్లీకి కోవర్టు.. అమెరికాలో చదివాడా? అంటూ కోమటిరెడ్డి

కేటీఆర్ ఢిల్లీకి కోవర్టు.. అమెరికాలో చదివాడా? అంటూ కోమటిరెడ్డి

కేటీఆర్ ఢిల్లీకి కోవర్టు కాదని.. చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. ఢిల్లీకి కోవర్టువు కాకుంటే ఎప్పుడో జైల్లో ఊచలు లెక్కబెట్టేవారని అన్నారు. అవినీతి కుంభకోణాలకు కేటీఆర్ కోవర్టు అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబమే కమీషన్ల కుటుంబమని ఆరోపించారు. కాళేశ్వరంతోపాటు ప్రతి ప్రాజెక్టులోనూ కల్వకుంట్ల ఫ్యామిలీకి కమీషన్లు వెళ్తున్న మాట నిజం కాదా ? అని ప్రశ్నించారు. కేటీఆర్ భాష, పద్ధతి బాగాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చదివింది అమెరికాలోనా.. గుంటూరు గల్లీల్లోనా? అని ప్రశ్నించారు. అసలు తెలంగాణ ఎలా వచ్చిందో కేటీఆర్‌కు తెలుసా? అని నిలదీశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+