వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు కోమటిరెడ్డి కృతజ్ఞతలు, ఎందుకంటే..?: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రేశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్

|
Google Oneindia TeluguNews

నల్గొండ/హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రేశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి ఇవ్వనందుకే ఆయన సీఎంకు కృతజ్ఞతలు చెప్పడం గమనార్హం.

ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవిని పొందాలని గుత్తా ఎంతగానో ఆశపడ్డారని, కానీ సీఎం ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకుండా మంచి పనిచేశారని సంతోషం వ్యక్తం చేశారు.
తనకు మంత్రి పదవి కోసం, తన తమ్ముడికి మదర్‌ డెయిరీ కోసం పార్టీ మారాడే తప్ప ఆయనకు ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని ఆయన విమర్శించారు.

ఇప్పటికే మూడు పార్టీలు మారిన గుత్తా రేపో మాపో ఏ పార్టీకి పోతాడో తెలియదని అన్నారు
బీ.వెల్లెంల ప్రాజెక్టు గురించి మాట్లాడే కనీస అర్హత సుఖేందర్‌రెడ్డికి లేదని అన్నారు. ఆ ప్రాజెక్టు ప్రజల కోసం కొట్లాడి నిర్మించుకున్న తన కలల ప్రాజెక్టు అని అన్నారు. గుత్తా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

kcr-komatireddy

నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం సాధించుకున్న తెలంగాణలో నిధులు, ఉద్యోగాలు ఎలాగూ లేవు, కనీసం తాగు, సాగు నీరు కూడా ప్రభుత్వం సక్రమంగా అందించడం లేదని వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డి. రాజేశ్వర్, ఫారూక్ హుస్సేన్ పేర్లు ఖరారయ్యాయి.

స్థానిక సంస్థల కోటా కింద ఎంఐఎం పార్టీకి చెందిన సయ్యద్ అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

English summary
Congress MLA Komatireddy Venkat Reddy on Sunday told thanks to Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X