ఇబ్రహీంపట్నం మహిళల మృతి పట్టదా? పాట్నా వెళ్లి రాజకీయాలా? కోమటిరెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న బాధితులలో నలుగురు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ఈ ఆపరేషన్లలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నలుగురు నిండు ప్రాణాలు పోయాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఇంత దారుణం జరిగితే సీఎం కేసీఆర్ కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదని అసహనం వ్యక్తం చేశారు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అని ప్రశ్నించారు. పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా? అంటూ కేసీఆర్ ను నిలదీశారు.

ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు రాజీనామా చెయ్యాలి

ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు రాజీనామా చెయ్యాలి

అనుకూల మీడియాలో వైద్య ఆరోగ్య శాఖ గురించి అనవసర ప్రచారం చేయించే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణం అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.మిగతా 30 మంది బాధిత మహిళల ఆరోగ్యానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వారికి పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశ రాజకీయాలు తర్వాత.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు, ప్రాణాలకు భరోసా ఇవ్వండి

దేశ రాజకీయాలు తర్వాత.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు, ప్రాణాలకు భరోసా ఇవ్వండి

బస్తీ దావఖానా పేరుతో అనవసర ప్రచారం ఆపి ఎక్కువ మంది సివిల్ సర్జన్లను నియమించి ఉంటే ఇంతటి ఘోరం జరగకుండా ఉండేది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలు తర్వాత చేయొచ్చు కానీ నమ్మి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు, వారి ప్రాణాలకు భరోసా ఇవ్వండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు తెలంగాణా సీఎం కేసీఆర్ ను ఈ వ్యవహారంలో టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+