కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం..
తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైన జాతరల్లో కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చ జానపదుల జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం(జనవరి 18) నాడు మల్లన్న జాతర.. కల్యాణోత్సవం, శకటోత్సవాలతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారంతో ప్రతి సంవత్సరం ఆరంభమయ్యే జాతర మూడు నెలలపాటు ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగుస్తుంది. బోనాలు, అగ్నిగుండాలు వంటి వేడుకలతో జానపదులు స్వామిని మెప్పిస్తారు. ఈ కొమురవెల్లి క్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ మల్లన్నను శివుని అవతారంగా కొలుస్తారు. అంతేకాదు మల్లన్న శివుని కొడుకు అని.. ఎల్లమ్మకు తమ్ముడు అని మల్లన్న కథలో వస్తుంది. మల్లన్న బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు. బలి సమర్పణలు ఈ ఆలయంలో ఉండవు. మల్లన్న సంప్రదాయంలో పూజ అంతా కూడా తెలుగు సంప్రదాయం ప్రకారం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని మల్లిఖార్జున స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఇక కొమురవెల్లి జాతర ఉగాది వరకూ కొనసాగుతుంది. అలాగే మహా శివరాత్రి రోజుల్లో అగ్నిగుండం కూడా ఉంటుంది.

ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications