చంపేస్తా.. సీరియస్ లుక్ లో కొండా మురళి; 'కొండా' సినిమా పోస్టర్ లు రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మ!!
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సినిమా 'కొండా'. తెలంగాణ రాజకీయాలలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కొండా దంపతుల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ కొండా సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్ర నిర్మాణం మొత్తం వరంగల్లోనే జరగనున్నట్లుగా వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొండా సినిమా కొత్త రచ్చ చేయనున్నట్టు చర్చ జరుగుతుంది.

కొండా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ
ఇక తాజాగా 'కొండా' సినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. పోస్టర్ లలోనే కొండా మురళి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. 1980వ సంవత్సరం జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి లవ్ స్టోరీ, కొండా మురళికి నక్సలైట్ ఆర్కే తో ఉన్న ప్రత్యేక అనుబంధం కథాంశాలుగా 'కొండా' మూవీ రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్నారు. ఇక వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ లో కొండా మురళి క్యారెక్టర్ ను బాగా గంభీరంగా చూపించనున్నట్లుగా కనిపిస్తుంది. పోస్టర్ పై గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్థం కాలే అంటూ సీరియస్ లుక్ తో కొండా మురళిని చూపించినట్లుగా కనిపిస్తుంది.

కొండా మురళి క్యారెక్టర్ ను బాగా అగ్రెసివ్ గా చూపించిన వర్మ
మరో పోస్టర్ లో చేతిలో తుపాకీ చుట్టూ నక్సల్స్, తలకు ఎర్ర తువాలుతో కొండాను చూపించారు. ఇంకొక చోట కత్తిని పైకి తీస్తూ కొండాను చూపించారు. మరో పోస్టర్ లో చేతిలో టీకప్పు పట్టుకుని సీరియస్ లుక్ తో కొండా మురళి కనిపిస్తారు. వర్మ విడుదల చేసిన నాలుగైదు పోస్టర్లలో ఒక పోస్టర్ లో తలపై బాటిల్ తో నోటిలో నీళ్ళు పోసుకుంటూ చాలా సీరియస్ గా కనిపించారు. కొండా మురళి క్యారెక్టర్ ను వర్మ సినిమాలో చాలా సీరియస్ గా చూపించినట్లుగా కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్లతో 'కొండా' ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో సాగుతోంది.

పోస్టర్ ల ద్వారా కొండా ఎలా ఉండబోతుందో చూపించిన ఆర్జీవీ
ఎన్ కౌంటర్ లో చంపబడిన నక్సలైట్ ఆర్కే అలియాస్ రామకృష్ణకు, కొండా మురళికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని చెప్పడంతో పాటుగా అన్ని పోస్టర్ లలోనూ సినిమాలో ఏం చెప్పదలచుకున్నారో అదే పోస్టర్ల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు రాంగోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నాడని చర్చ జరుగుతుంది. రియల్ స్టోరీలను తెరకెక్కించి వివాదాలను సృష్టించే రాంగోపాల్ వర్మ ఈసారి కొండా దంపతులపై సినిమా తీసి తెలంగాణ రాజకీయాలలో కొత్త కాంట్రవర్సీ సృష్టించబోతున్నాడని ప్రస్తుతం చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణ రక్త చరిత్ర చూపిస్తానంటూ రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటనచేసినప్పటి నుండి ఇది ఎలా ఉండబోతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

తెలంగాణా రక్త చరిత్ర తెరకెక్కించనున్న వర్మ
తెలంగాణ రక్త చరిత్రను తెరకెక్కించే ప్లాన్ లోభాగంగా కొండా మురళి బయోపిక్ పేరుతో వర్మ రూపొందించనున్న సినిమాలో కొండా మురళి, సురేఖ ఆర్.కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఉంటాయని రాంగోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 'కొండా' సినిమాకు సంబంధించి వర్మ ఓ వాయిస్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఆ వాయిస్ లో వర్మ విజయవాడలో చదువుకోవడం వల్ల తనకు అక్కడి రౌడీయిజం గురించి తెలుసని, రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బాంబు బ్లాస్ట్ వల్ల రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి తెలిసిందని కానీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి తనకేమీ తెలియదన్న వర్మ ఆసక్తికర అంశాలతో తెలంగాణా రక్త చరిత్ర తీయబోతున్నానని ప్రకటించారు.

మురళి లవ్ స్టోరీ .. నాటి తిరుగుబాటు .. రెండిటి నేపధ్యాలతో
ఈ మధ్య అనుకోకుండా తను కలిసిన మాజీ నక్సలైట్ లు, అప్పటి పోలీసులతో మాట్లాడటం వల్ల మొదటి సారి ఆ విషయంపై ఓ అవగాహన వచ్చిందని వర్మ పేర్కొన్నారు. ఇక అన్నిటికంటే తనను అత్యంత ప్రభావితం చేసిన విషయం ఎన్ కౌంటర్ లో చంపబడిన ఆర్.కె అలియాస్ రామకృష్ణకి, కొండా మురళికి వున్న ప్రత్యేక సంబంధం అంటూ రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. కొండా మురళి, సురేఖల లవ్ స్టోరీ, పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాటం చేస్తున్న రోజులలో కొండ మురళి, ఆర్కే నాయకత్వంలో సాగిన తిరుగుబాటు కథాంశంగా రాంగోపాల్ వర్మ తన సినిమా లైన్ చెప్పారు.

వరంగల్ లో కొండా సినిమా దుమారం .. అందరిలో ఉత్కంఠ
కొండా సినిమా షూటింగ్ పూర్తిగా వరంగల్ , ఆ పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగనుందని అతి త్వరలో ఈ విప్లవం మొదలు కానుందని రాంగోపాల్ వర్మ తన వాయిస్ ద్వారా కొండ మురళి బయోపిక్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా రాంగోపాల్ వర్మ సినిమా తీయడని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కొండ మార్కు రాజకీయంతో సంచలనం సృష్టించిన కొండా దంపతుల కథలో వర్మ రాజకీయంగా ఎలాంటి కాంట్రవర్సీ చెయ్యబోతున్నారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కొండా చిత్ర నిర్మాణం కోసం రాం గోపాల్ వర్మ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కొండా అభిమానులు, శత్రువులు సైతం ఆ సినిమా కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కొండా మురళికి, ఎర్రబెల్లి దయాకర్ రావుకు శతృత్వం ఉన్న నేపధ్యంలో ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications