ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

గురుకుల సంక్షేమ హాస్టళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలో ఇది మొదటి ఘటన అని.. చాలా బాధగా ఉందన్నారు.

Conspiracies in Gurukuls Konda Surekha makes sensational allegations against RS Praveen Kumar

నిమ్స్‌లో ఆ అమ్మాయికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చామని, కానీ, ఫలితం లేకపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. అంత బాధ మీకు ఉంటే ఆ అమ్మాయి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ాలా జరిగాయని, కానీ, అక్కడికి ఎవరూ వెళ్లలేదన్నారు.

గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యులైన అధికారులను కూడా సస్పెన్షన్ చేశామన్నారు. ఫుడ్ పాయిజన్ వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తోందన్న మంత్రి కొండా సురేఖ.. పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామన్నారు.

ప్రభుత్వాన్ని నడపకుండా చేయాలని ఒక ప్రణాళికతో డ్రామాలు చేస్తున్నారన్నారు. గురుకులాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని.. ఆ సమయంలో తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని కొండా సురేఖ అన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని గతంలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారని మంత్రి గుర్తు చేశారు. గతంలో 99 కోట్ల రూపాయలు టెండర్లు లేకుండానే ఖర్చు చేశారన్నారు. 103 బీఆర్ఎస్ నేతల బంధువుల భవనాలు గురుకులాలకు కిరాయికి ఇచ్చారని మంత్రి అన్నారు.

కేటీఆర్ భయపడుతున్నారు

లగచర్లలో కలెక్టర్‌ను మర్డర్ చేయాలని చూశారని మంత్రి సురేఖ ఆరోపించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఉసురు తీసుకోలేదా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. కేటీఆర్ సోదరి లోపల ఉన్నన్ని రోజులు మంచిగానే ఉన్నాడని.. కానీ, బయటకు వచ్చిన నాటి నుంచి భయపడుతున్నారన్నారు. కవిత, హరీశ్ రావు ఒక్కటయ్యారని కేటీఆర్ భయపడుతున్నారన్నారు. కేసీఆర్ కవితకు ప్రియారిటీ ఇస్తున్నారని కేటీఆర్ భయపడుతున్నారని చెప్పుకొ్చారు. మరోవైపు, వరంగల్ విమానాశ్రయం కోసం 254 ఎకరాలు భూ సేకరణ చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+