వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డికి కొండంత అండగా కొండా సురేఖ?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల గురించి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బిజెపి, వైఎస్ఆర్టిపి, బీఎస్పీ వంటి పార్టీల పరిస్థితి గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండ సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడిన కొండా సురేఖ పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పెద్దల గురించి ఆలోచించే పార్టీలు బీఆర్ఎస్, బిజెపి అని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

 షర్మిల పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు

షర్మిల పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు

వైయస్సార్ తెలంగాణ పార్టీ అనేది వైయస్ షర్మిల తన సొంత ప్రయోజనాల కోసం పెట్టిన పార్టీ అని కొండ సురేఖ విమర్శించారు. తన అన్నను కాదని తెలంగాణ కోడలు అని ఇప్పుడు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, షర్మిల పార్టీ వెనుక స్వార్థం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం ఉండదని కొండ సురేఖ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు చీల్చడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చిందని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ని చీల్చడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని కొండ సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉత్తమ్ కుమార్ వల్ల పార్టీకి ప్రయోజనం లేదన్న సురేఖ

ఉత్తమ్ కుమార్ వల్ల పార్టీకి ప్రయోజనం లేదన్న సురేఖ

కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిప్రాయ బేధాలపైన మాట్లాడిన కొండ సురేఖ బిఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలు అందరూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుందన్నారు. ఇక మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ కాంగ్రెస్ కి ఉత్తమ్ కుమార్ వల్ల ప్రయోజనం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారని కొండా సురేఖ గుర్తు చేశారు.

చిన్న చిన్న పదవుల కోసం పార్టీకి నష్టం చెయ్యొద్దు

చిన్న చిన్న పదవుల కోసం పార్టీకి నష్టం చెయ్యొద్దు


చిన్న చిన్న పదవుల కోసం పార్టీకి నష్టం కలిగించవద్దని పేర్కొన్న కొండా సురేఖ, సీనియర్లకు రేవంత్ వర్గానికి మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాలు గౌరవంగా ఉండాలని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. పిసిసి పీఠంలో ఎవరున్నారు? ఏ పార్టీ నుంచి వచ్చారు? అన్నది చూడవద్దని పేర్కొన్న కొండ సురేఖ అందరూ కలిసి కట్టుగా ఉండాలన్నారు.

పొత్తులపైన కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

పొత్తులపైన కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతలు వెళ్లి బిజెపిలో చేరారని, కానీ నాకు ఆ ఉద్దేశం లేదని వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాలని భావిస్తే మీకే చెబుతానని పేర్కొన్న కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పనిచేయాలని, ఎవరితో పొత్తులు పెట్టుకున్న విభేదాలు బయటకు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తో, కేంద్రంలోని బిజెపితో కలిసి నడిచే పరిస్థితి ఉండబోదని వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని కొండ సురేఖ వ్యాఖ్యానించారు. కర్ణాటక తరహాలో తెలంగాణ నేతలందరూ కలిసి పాదయాత్ర చేయాలని, బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కొండ సురేఖ అభిప్రాయపడ్డారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలకు ఏం సందేశం ఇస్తున్నారు?

ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలకు ఏం సందేశం ఇస్తున్నారు?

అధిష్టానం పిలిచినా ఉత్తమ్ కుమార్ రెడ్డి బోయినపల్లి సమావేశానికి వెళ్లకపోవడం ఏమిటని ప్రశ్నించిన కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆయన కోసం కాదు పార్టీ కోసమేనని, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు కలిసి రావాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పై బిజెపి పోరాటం చేస్తే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, గ్రానైట్ కుంభకోణం విషయంలో కఠినంగా వ్యవహరించాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతు ప్రకటించినట్లుగా కనిపిస్తుంది.

English summary
Konda Surekha made sensational comments in support of Revanth Reddy. Everyone wants to work together and make Revanth Padayatra a success
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X