వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి అత్యవసరమైతే 4 టీఎంసీలు తీసుకోవచ్చు, వచ్చేసారి బెజవాడలో

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం మధ్యాహ్నం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా తాగునీటి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 టిఎంసీల నీటిని కేటాయించారు. అత్యవసరమైతే నాలుగు టీఎంసీలు వాడుకోవచ్చని బోర్డు తెలిపింది.

ఏపీకి అత్యవసరమైతే మాత్రం కృష్ణానది నుంచి 4 టీఎంసీల నీటిని వాడుకోవచ్చనే చెబుతూ వెసులుబాటును కల్పించింది. బోర్డు సభ్యులు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను తీర్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు.

krishna water board meeting in Hyderabad

హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే నిమిత్తం కృష్ణ నుంచి సామర్థ్యం మేరకు నీరు తీసుకెళ్లచ్చని బోర్డు వెల్లడించింది. ఇరు రాష్ట్రాలూ సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకు సాగాలని సూచించింది. తదుపరి నదీ జలాల బోర్డు సమావేశం విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీశైలం డ్యాం పటిష్టతకు చర్యలు చేపట్టాలని కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశించింది.

చండీయాగానికి భారతీ తీర్థ స్వామిని ఆహ్వానించిన కెసిఆర్

కర్ణాటకలోని శృంగేరి మఠాధిపతి భారతీ తీర్థానంద స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం కలిశారు. తాను నిర్వహించనున్న చండీ యాగానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను ఇచ్చారు. కేసీఆర్ దంపతులు తీర్థానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు శృంగేరి చేరుకున్న కేసీఆర్‌కు మఠాధిపతులు ఘన స్వాగతం పలికారు.

English summary
krishna water board meeting in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X