ఏం అడగకుండా కారెక్కిన కృష్ణ, టిడిపిలో అర్ధనగ్న ప్రదర్శన: కెటిఆర్, 'కామెంట్ చేస్తారు కానీ'
హైదరాబాద్: మాజీ మంత్రి సి కృష్ణయాదవ్ ఏం ఆశించకుండా తెరాసలో చేరారని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు చెప్పారు. ఈ రోజు మంత్రి కెటిఆర్ సమక్షంలో కృష్ణ యాదవ్, దిడ్డి రాంబాబు తదితరులు కారు ఎక్కారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. అన్ని పార్టీల కార్యాలయాలకు తాళాలు పడ్డాయని చెప్పారు. గాంధీ భవన్‌కే రక్షణ కల్పించలేని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీమాంధ్రులకు ఏం కల్పిస్తారని ఎద్దేవా చేశారు. ఏం ఆశించకుండా కృష్ణయాదవ్ పార్టీలో చేరారని కితాబిచ్చారు.
గాంధీ భవన్‌కు తాళం పడిందని, టిడిపి కార్యాలయంలో అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయని, బిజెపి కార్యాలయంలో కుర్చీలు లేస్తున్నాయని, ఒక్క తెరాసలోనే విజయోత్సవం కనిపిస్తోందన్నారు. యుగానికి ఒక్కరే కెసిఆర్ లాంటి వ్యక్తి పుడతారన్నారు.

అధికార టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద స్థానాలు గెలుచుకుంటే విపక్ష నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మంత్రి కెటిఆర్ సవాల్ చేశారు. వాళ్లు యాభై ఏళ్లలో చేయలేని అభివృద్ధిని తాము అయిదేళ్లలో చేసి చూపిస్తామన్నారు.
టిడిపి నుంచి తెరాసలో చేరిన కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. జెండా మోసిన కార్యకర్తలకు టిడిపిలో విలువ లేదన్నారు. సీఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. తెరాస పాలనతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ కోసమే తాను కారు ఎక్కానని చెప్పారు.
మాకు ఓటేయకున్నా ఫరవాలేదు: కెటిఆర్
తెరాస అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కుంటుందని కొంతమంది అపోహలు సృష్టించారని కెటిఆర్ వేరుగా అన్నారు. ఆయన సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్‌పల్లిలోని కస్తూర్బా డిగ్రీ కాలేజీ వార్షికోత్సవంలో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తమదే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ముఖ్యమైనదని చెప్పారు. హైదరాబాదులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటింగ్ శాతం తగ్గుతోందన్నారు. నగర ఓటర్లు నాయకులను కామెంట్ చేస్తారు కానీ ఓటేయలన్నారు.
మీరు డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి రావాలని అనడం లేదని, పోలింక్ కేంద్రానికి ఓటేసేందుకు రావాలన్నారు. విద్యార్థులు ఉదాసీనంగా ఉండే దేశానికి మంచి నాయకులు రారన్నారు. నా పార్టీకి ఓటు వేయమని అడుగుతా.. మాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications