అర్థరాత్రి ఇంటికి వచ్చాడని, కాళ్ళు, చేతులు విరగొట్టాడు, వివాహేతర సంబంధమేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

మెదక్: అర్ధరాత్రి తన ఇంటికి ఓ వ్యక్తి రావడంతో తన భార్యతో వివాహేతరం సంబంధం ఉందని భావించిన భర్త తన ఇంటికి వచ్చిన వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకొంది.

మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్ధిపూర్ గ్రామానికి చెందిన మేకల కిష్టయ్య ఇంటికి ఆదివారం రాత్రి రవి వెళ్ళాడు.అయితే తన భార్యకు రవికి వివాహేతర సంబంధం ఉందని కిష్టయ్య భావించాడు.

krishnaiah attacked on ravi for illegal affair in medak district.

దీంతో కిష్టయ్య రవిపై గొడ్డలితో దాడి చేశాడు. రవి కాలు, చేయి నరికేశాడు. అంతేకాదు ఆయన కళ్ళల్లో కూడ పొడిచాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు రవి.

స్థానికులు రవిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
krishnaiah attacked on ravi for illegal affair in tekmal at medak district.when ravi reached krishnaiah's house on sunday night, krishnaiah attacked on him.
Please Wait while comments are loading...