వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్... గోడు వెళ్లబోసుకున్న బాధితులు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దుబాయిలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బతుకుతెరువు కోసం దుబాయి వెళ్లి ఇబ్బందులకు గురవుతున్న వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

దాంతో పాటు దుబాయి జైళ్లో ఉన్న వారిని విడిపిస్తామని చెప్పారు. దుబాయి పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌, సోమవారం తన బృందంతో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన వారు కనీసం లక్ష మందైనా అక్కడ పనిచేస్తున్నారని అంచనా వేశారు. మంత్రి సోమవారం.. 20వేల మంది కార్మికులు ఉన్న సోనాపూర్‌ శిబిరాన్ని సందర్శించి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు.

బ్రోకర్లను నమ్మి మోసపోయామని పలువురు ఈ సందర్భంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. సరైన ఉద్యోగాలు లేవని, జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇకపై ఇలాంటి కష్టాలు ఉండబోవని, ఇక్కడికి వచ్చే వారికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

చట్టాల పట్ల అవగాహన కల్పిస్తామని, దుబాయిలోని భారత రాయబార కార్యాలయంలో తెలుగు మాట్లాడే అధికారులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. దుబాయి నుంచి తిరిగి రావాలనుకునే వారికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంతకుముందు మంత్రి... దుబాయి కేంద్ర కారాగారాన్ని సందర్శించి అక్కడ ఉన్న తెలంగాణ ఖైదీలను పరామర్శించారు. వారిని విడుదల చేయించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తర్వాత దుబాయ్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్ లో తెలంగాణ భవిష్యత్తును కళ్లకు కట్టారు మంత్రి కేటీఆర్. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది, తెలంగాణ అత్యుత్తమ పారిశ్రామిక పాలసీని ప్రవేశ పెట్టిందని వివరించారు. అత్యంత నాణ్యమైన మానవ వనరులు, అంతర్జాతీయ నగరంలో దొరకడం హైదరాబాదులోనే సాధ్యమన్నారు.

 సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

దుబాయిలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బతుకుతెరువు కోసం దుబాయి వెళ్లి ఇబ్బందులకు గురవుతున్న వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

దాంతో పాటు దుబాయి జైళ్లో ఉన్న వారిని విడిపిస్తామని చెప్పారు. దుబాయి పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌, సోమవారం తన బృందంతో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన వారు కనీసం లక్ష మందైనా అక్కడ పనిచేస్తున్నారని అంచనా వేశారు. మంత్రి సోమవారం.. 20వేల మంది కార్మికులు ఉన్న సోనాపూర్‌ శిబిరాన్ని సందర్శించి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు.

 సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

బ్రోకర్లను నమ్మి మోసపోయామని పలువురు ఈ సందర్భంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. సరైన ఉద్యోగాలు లేవని, జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇకపై ఇలాంటి కష్టాలు ఉండబోవని, ఇక్కడికి వచ్చే వారికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

 సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

సోనాపూర్‌ శిబిరంలో మంత్రి కేటీఆర్...

తర్వాత దుబాయ్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్ లో తెలంగాణ భవిష్యత్తును కళ్లకు కట్టారు మంత్రి కేటీఆర్. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది, తెలంగాణ అత్యుత్తమ పారిశ్రామిక పాలసీని ప్రవేశ పెట్టిందని వివరించారు. అత్యంత నాణ్యమైన మానవ వనరులు, అంతర్జాతీయ నగరంలో దొరకడం హైదరాబాదులోనే సాధ్యమన్నారు.

ఐబీపీసీ (ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్) ఫిక్కీ కలిసి ఏర్పాటుచేసిన ఈ సదస్సులో సుమారు 100 మంది పెద్ద ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీని ఆయన సవివరంగా తెలిపారు. భూమి, వనరులు, సత్వర అనుమతులు ఇస్తున్న తెలంగాణ పాలసీ ఈ సదస్సులో అందరినీ ఆకట్టుకున్నాయి.

అనంతరం మంత్రి కేటీఆర్‌, పరిశ్రమల శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, కమిషనర్‌ జయేష్‌రంజన్‌ తదితరులు ‘లులు' సంస్ధ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా బృందం కోరగా... తెలంగాణలో రాబోయే ఏడాది కాలంలో రూ.2500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ‘లులు' సంస్థ ముందుకు వచ్చింది.

పండ్లు, కూరగాయలు, మాంసం ప్రాసెస్‌ యూనిట్‌ల ఏర్పాటుతో పాటు హైదరాబాద్‌లో ఆధునిక షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని కోసం జనవరిలో ‘లులు' ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ సమీపంలో నెలకొల్పనున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టే విషయమై బయోటెక్‌ డైరెక్టర్‌ మార్వన్‌ అబ్దుల్‌ అజీజ్‌తో కేటీఆర్‌ చర్చించారు.

English summary
The Minister for IT, Government of Telangana Sri KT Rama Rao met migrant workers from Telangana who are working in Dubai. Migrant workers from Telangana constitute the second largest group of migrant workers after those from Kerala. It is estimated that there are about a lakh workers from Telangana in Dubai. The Minister visited Sonapur camp where about 20,000 workers from Telangana live. The Minister inspected their living facilities, kitchen, dining hall, and bathrooms. He then conducted detailed interaction with them about their problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X