వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేవల్లో పారదర్శకత: గవర్నర్‌‌తో కేటీఆర్(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంగళవారం రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహాన్‌తో సమావేశమైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోని అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా సేవల్లో పారదర్శకత ఉంటుందని చెప్పారు.

ఈ సందర్బంగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ది, విద్యార్దుల్లో నైపుణ్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, ఈ పంచాయితీల ఏర్పాటు తదితర అంశాలపై గంటపాటు గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ హాబ్, ఐటీఐఆర్ ప్రాజెక్టుల ప్రగతిని ప్రస్తావించారు.

ఇంజనీరింగ్ విద్యార్దుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు "టాస్క్" వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఐటీఐఆర్ తొలిదశను ఐదేళ్లలో పూర్తి చేసి సుమారు 2.50 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మహానగరాన్ని వైఫై సిటీగా మార్చడంతో పాటు 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానునట్లు చెప్పారు.

సమగ్ర కుటుంబ సర్వే, మన ఊరు-మన ప్రణాళిక వంటి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్బంలో ఐటీ సేవలు ప్రజలకు మేలు కలిగించాలని, రోజు వారీ అవసరాలు తీర్చే విధంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ఇచ్చిన సలహాలు, సూచనలు అమలు చేస్తామని వెల్లడించారు.

గవర్నర్ నరసింహాన్‌తో కేసీఆర్ భేటీ

గవర్నర్ నరసింహాన్‌తో కేసీఆర్ భేటీ

రాష్ట్రంలో ఐటీరంగ విస్తరణకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇంక్యుబేటర్, టీ హబ్, గేమ్‌సిటీ, టాస్క్ లాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, వాటి ప్రాముఖ్యాన్ని గవర్నర్‌కు తెలిపారు.

గవర్నర్ నరసింహాన్‌తో కేసీఆర్ భేటీ

గవర్నర్ నరసింహాన్‌తో కేసీఆర్ భేటీ

ప్రపంచంలో గేమ్‌సిటీకి 224 బిలియన్ డాలర్ల నెట్‌వర్క్ ఉండగా, భారత్‌లో కేవలం 4 బిలియన్ డాలర్ల నెట్‌వర్క్ మాత్రమే ఉన్నదని, ఈ తేడాను పూరించేందుకు హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ గేమ్‌హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

 గవర్నర్ నరసింహాన్‌తో కేసీఆర్ భేటీ

గవర్నర్ నరసింహాన్‌తో కేసీఆర్ భేటీ

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఏటా లక్షల మంది పట్టభద్రులు బయటకొస్తున్నా ఉపాధి అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్న విషయాన్ని ఈ సమావేశంలో గవర్నర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే చర్యలు చేపడుతున్నామని, అందుకోసం టాస్క్ పథకాన్ని రూపొందించినట్లు కేటీఆర్ వివరించారు.

గవర్నర్ నరసింహాన్‌తో కేటీఆర్భేటీ

గవర్నర్ నరసింహాన్‌తో కేటీఆర్భేటీ

సమావేశం అనంతరం రాజ్‌భవన్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రాధాన్యాలను వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి గవర్నర్ పలు నిర్ణయాత్మక సలహాలు ఇచ్చారని, వాటి ఆధారంగా రాబోయేరోజుల్లో ప్రభుత్వం మరింత మెరుగైన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. విలువైన సూచనలు చేసినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

English summary
Governor ESL Narasimhan expressed happiness over the progress in IT sector in Telangana when IT Minister KT Rama Rao gave a power-point presentation on the government’s initiatives in IT and Panchayat Raj departments on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X