అమాయక కర్ణాటక కాదిది: సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్, కవిత చురకలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారుపై కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కామారెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మీరు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటంటూ సిద్దరామయ్యపై మండిపడ్డారు.

'సిద్ధరామయ్య గారు.. కర్ణాటకలో మీది "5 గంటల.. ఫెయిల్యూర్ మోడల్" తెలంగాణలో మాది "24 గంటల.. పవర్ - ఫుల్ మోడల్". పదేళ్ల ప్రస్థానం తరువాత కూడా.. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు.. ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన మాది. అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే... తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీది' అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

KTR and Kavitha slams karnataka cm siddaramaiah and congress

'మీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలకు పాతరేసి.. నమ్మి ఓటేసిన ఆ ప్రజలను పూర్తిగా గాలికొదిలేసి.. ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదు.. తెలివైన తెలంగాణ.. రైతులకు ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని మీరు.. మీ ప్రజలకిచ్చిన ఐదు హామీల్ని.. ఐదేళ్లయినా అమలుచేయలేరు' అంటూ సిద్దరామయ్య సర్కారుకు కేటీఆర్ చురకలంటించారు.

'మీ రాష్ట్రంలో కనీసం రేషన్ ఇవ్వలేరు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరు.. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే.. ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే... ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే.. వైఫల్యాల కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధం..! నమ్మి మోసం చేసినందుకు మీకు సరైన గుణపాఠం చెప్పడం తథ్యం..!!' అని సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు కేటీఆర్.

సిద్దరామయ్యకు కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదంటూ కవిత కౌంటర్

తెలంగాణను దేశంలోని నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కర్ణాటకలో మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని.. మేనిఫెస్టోలో చేర్చని హామీలను సైతం అమలు చేసి చూపించారని అన్నారు. గొప్ప రాష్ట్రమైన కర్నాటకలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ వంటి రాష్ట్రాలకు వచ్చే ముందు ఇక్కడి స్థితిగతులన్నింటినీ తెలుసుకొని రావాలని సిద్ధరామయ్యకు హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరారు కవిత. ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే అక్కడి సీఎం సిద్ధరామయ్య మన రాష్ట్రానికి వచ్చి బీసీలకు ఏం చేయాలో మన సీఎం కేసీఆర్‌కు పాఠాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+