తెలంగాణ సర్కార్ సమర్థత.. వరల్డ్ టాప్ ఐటీ కంపెనీలు హైదారాబాద్ లో : కేటీఆర్
హైదరాబాద్ : ఐటీ రంగ పురోగతి కోసం తెలంగాణ సర్కార్ క్రుషి చేస్తోందన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఐటీ నిపుణులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. బేగంపేటలోని హెచ్ఐసీసీలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన డేటా అనాలసిస్ పాలసీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్యక్రమం సందర్బంగా.. సైబర్ సెక్యూరిటీ, డేటా పాలసీలను ప్రారంభించిన కేటీఆర్.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ ను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి రెండున్నరేళ్లుగా అనేక చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చిన కేటీఆర్.. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-5 కంపెనీలు హైదరాబాద్ లో కొలువుదీరాయన్నారు. తెలంగాణ సర్కార్ సమర్థతకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు కేటీఆర్.

ఇక డేటా అనాలసిస్ పాలసీల గురించి ప్రస్తావిస్తూ.. రాబోయే రోజుల్లో డేటా అనాలసిస్ పాలసీలు కీలకం కాబోతున్నాయని చెప్పారు. ప్రతీ ప్రభుత్వానికి సైబర్ సెక్యూరిటీ అనేది ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిందన్నారు. ఉపాధి రంగానికి ఐటీ కీలకంగా మారిందన్న కేటీఆర్.. తయారీ రంగంలో కూడా వేలాది మందికి ఉద్యోగవకాశాలు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications