60ఏళ్ల దరిద్రం ఒక్కసారి పోదు: కెటిఆర్, ఇంతేనా!: 'ప్రత్యూష'పై హైకోర్టు
నిజామాబాద్: అరవై ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోయేది కాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం నాడు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆయన కుర్తి గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
గత ప్రభుత్వాల పాలకుల పైన విమర్శలు గుప్పించారు. గత పాలకులు చేసిన పాపాలు మేం కడుగుతున్నామన్నారు. అరవయ్యేళ్ల దరిద్రం ఒక్కసారిగా పోదన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కెసిఆర్ ఫౌండేషన్ ద్వారా కుర్తి గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరూ చేశారన్నారు.
మంజీరాలో రూ.60 లక్షలతో చెక్ డ్యాం నిర్మాణం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘం సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్నారు. అందులో భాగంగానే గ్రామజ్యోతిని ప్రారంభించామన్నారు.

గ్రామజ్యోతిలో అందరూ పాల్గొనాలి : హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పార్టీలకతీతంగా అందరూ పాల్గొనాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో ఏర్పాటు చేసిన గ్రామజ్యోతిలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామంలో ప్రతీ ఇంటికీ చెట్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు.
ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలో టాయిలెట్లు నిర్మించుకోవాలని సూచించారు. లక్డారంలో శ్మశాన వాటిక, డంప్ యార్డ్‌ను నిర్మిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు.
ప్రత్యూష నివేదికపై హైకోర్టు సంతృప్తి
ప్రత్యూష సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం సమర్పించి నివేదిక పైన హైకోర్టు గురువారం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యూష లాంటి బాలికలు ఎంతమంది ఉన్నారో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణతో పాటు ఏపీని కూడా ఆదేశించింది.
ప్రత్యూష లాంటి వారిని గుర్తించాలని సూచించింది. అలాంటి వారిని గుర్తించి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగింది. సవతి తల్లి వేధింపుల బాలికల విషయంలో ఎవరో వచ్చి వెలికి తీసే వరకు ప్రభుత్వాలు పట్టించుకోవా అని ప్రశ్నించారు. ఎన్ని పథకాలు చేపట్టినా ప్రత్యూషలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పథకాలు కాగితాలకే పరిమితం కావొద్దంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications