విశేష కృషి: కేటీఆర్‌కు గ్లోబల్ ఛాంపియన్ డిజిటల్ లిటరసీ అవార్డు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు డిజిటల్ అక్షరాస్యతలో గ్లోబల్ ఛాంపియన్ పురస్కారం దక్కింది. అమెరికాకు చెందిన సెర్టిఫోర్ట్ సంస్థ కేటీఆర్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. సంస్థ ఉపాధ్యక్షుడు జాన్‌డే ఈ పురస్కారాన్ని కేటీఆర్‌కు ఆయన నివాసంలో ప్రదానం చేశారు.

సెర్టిపోర్ట్ ఇంటర్నేషనల్ సేల్స్ ఉపాధ్యక్షుడు జాన్ డే ఆదివారం బేగంపేటలోని నివాసంలో మంత్రి కెటి రామారావును కలిసి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జాన్ డే మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రభుత్వ ప్రతినిధులకు తాము ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా జాన్ తెలిపారు.
కేటీఆర్.. టీహబ్, ఇతర ఆవిష్కరణ ద్వారా డిజిటల్ అక్షరాస్యతకు చేయూతనిచ్చారని, టాస్క్ ద్వారా ఉపాధి కల్పించారని, ఐటీ రంగంలో పెట్టుబడుల సమీకరణకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవటమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

మంత్రి కేటీఆర్ తన నిర్ణయాలతో ఐటీ రంగంలో కొలువులకు విద్యార్థులను అత్యున్నత రీతిలో సన్నద్ధం చేశారని కొనియా డారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్ (టాస్క్) ఏర్పాటుతో విద్యార్థుల్లోని నైపుణ్య లోపాలను భర్తీ చేశారన్నారు. ఔత్సాహికుల ప్రోత్సాహా నికి, వ్యవస్థాపకులకు మార్గదర్శకంగా టీ హబ్ ప్రారంభించి డిజిటల్ తెలంగాణను ముందంజలో ఉంచారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications