దండుపాళ్యం బ్యాచ్‌తో జాగ్రత్త: 4 తర్వాత కొత్త పథకాలు వస్తాయన్న కేటీఆర్

వికారాబాద్: ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను ఆగమాగం చేస్తాయని.. అయితే, ప్రజలు మాత్రం ఆలోచించి ఓటేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఎన్నో ఛాన్సులు ఇచ్చినా.. మళ్లీ ఇప్పుడొచ్చి మరో ఛాన్స్ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరిందని.. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు కేటీఆర్. కరెంట్ పై రేవంత్ రెడ్డికి అనుమానం ఉంటే.. విద్యుత్ తీగలను పట్టుకోవాలని చురకలంటించారు. కరెంట్ పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

KTR hits out at congress and bjp leaders in Vikarabad road show

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్య ఉండేదని.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ సమస్య, తాగునీటి సమస్యలు పరిష్కరించుకున్నామని కేటీఆర్ తెలిపారు. తెలివి తక్కువ కాంగ్రెస్ నేతల చేతుల్లో రాజ్యం పెట్టొద్దన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కరోనా వల్ల, కాంగ్రెస్ కేసుల వల్లే జాప్యం అవుతోందన్నారు కేటీఆర్.

ఇదే వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆనాడు తెలంగాణ రాక ముందు ప‌రిస్థితులు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను ఆగమాగం చేస్తాయని విమర్శించారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ‌లో ఉన్న‌దంతా బీద బిక్కి రైతులు. 24 గంట‌ల క‌రెంట్ అవ‌స‌రం లేద‌ని రేవంత్ రెడ్డి అంటున్నాడని మండిపడ్డారు.

డిసెంబర్ తర్వాత 4 కొత్త పథకాలు వస్తున్నాయని.. కోడళ్లందిరికి రూ.3 వేల సాయం అందిస్తామని కేటీఆర్ చెప్పారు. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల జీవిత బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని.. ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి రైతులు బాధపడుతున్నారని తెలిపారు. మనం ఆ తప్పు చేయొద్దని, డిసెంబర్ 3న కేసీఆర్‌ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు కేటీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+