Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ మనసు గాయపర్చిన కెటిఆర్, రిజైన్ నీ కోర్టులోనే: రేవంత్ (ఫోటోలు)

హైదరాబాద్: సెటిలర్ అనే పదమే హేయమైనదని, కోదండరామ్, గద్దర్, విమలక్క, చుక్కా రామయ్య వీరంతా సెటిలర్లు అవుతారా అని తెలంగాణ టిడిపి యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మేం కూడా తెలంగాణఅ బిడ్డలమేనని, ఈ గడ్డ కోసం ప్రాణాలిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తమకు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదని, వాస్తవాలు వాస్తవాలుగానే మాట్లాడుతామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు.. సెటిలర్లు అవుతారా అని నిలదీశారు.

హైదరాబాద్ భారతీయులందరిదీ అని, ఇక్కడ ఎవరైనా పోటీ చేయవచ్చునని చెప్పారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ భారత పౌరురాలయ్యారని, ఆమెను భారతీయురాలు కాదని ఎవరూ అనడం లేదన్నారు. ప్రజాస్వామ్యం అందరికీ హక్కులు ఇస్తోందని చెప్పారు.

ఓట్ల కోసం తెలంగాణవారిని కించపర్చే మాటలు మంత్రి కెటిఆర్ మాట్లాడవద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రతినిధిగా ఎన్నికై వారి మనోభావాలు దెబ్బతీయవద్దన్నారు. ఎన్నికలు రాగానే మీది తెనాలి.. మాది తెనాలి అని గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా చేశారు. ఇళ్లు కూలగొట్టినప్పుడు ఎందుకు గుర్తుకు లేదన్నారు. 100 సీట్లు గెలుపుపై రాజీనామా బంతి ఇప్పుడు కెటిఆర్ కోర్టులో ఉందని చెప్పారు.

కేంద్రం నుంచి నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రేటర్లో బిజెపి - టిడిపి జెండా ఎగరడం ఖాయమన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో చాలామంది నేతలు తొలుత టిడిపిలోనే రాజకీయ జీవితం ప్రారంభించారని గుర్తు చేశారు.

నాయకులు వెళ్లినంత మాత్రాన ఏం కాదని, మరింతమంది నాయకులను తయారు చేసే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. అధికార పార్టీకి నేతలు లేక తమ వారిని అరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం వస్తే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, ప్రజల రక్షణ అని చెప్పి అందులో ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడం లేదని, హుస్సేన్ సాగర్‌ను ఖాళీ చేయించి మంచినీటిని నింపుతామని సీఎం కెసిఆర్ ప్రకటించారని, ఇందిరా పార్కులో వినాయక సాగర్‌, ట్యాంక్‌బండ్‌పై ఆకాశహార్మ్యాలు నిర్మిస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఇలా ఎన్నో హామీలు గుప్పించారని, హైదరాబాద్‌ చుట్టూ ఆకాశ మార్గాలు, నడక వంతెనలు నిర్మిస్తామని శంకుస్థాపన చేశారన్నారు. నిధులు, ప్రణాళిక, ప్రాజెక్టు నివేదిక లేకుండా ఎలా నిర్మిస్తారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో కళాభారతి, రవీంధ్రభారతిని నిర్మిస్తున్నట్లు 3డీలో రంగుకల చూపించారన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికే అన్నారు. ఒక్క ప్రాజెక్టుకు అడుగు పడలేదన్నారు. 18 నెలల కాలంలో నగరానికి ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు. తాను కూడా సెటిలర్‌ అని కేటీఆర్‌ చెప్పడం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా నగర ప్రజలు తెరాసను నమ్మరన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తమకు ఓటేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తన్నారని, గ్రేటర్ హైదరాబాద్ వ్యవస్థ స్వతంత్ర సంస్థ అన్నారు. ఏటా రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ఈ నిధులతో నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

కేంద్రంలో కూడా తమ భాగస్వామ్య ప్రభుత్వం ఉందని, అక్కడి నుంచి నిధులు తెచ్చి నగరాన్ని బంగారు తునకలా మార్చవచ్చన్నారు. హైదరాబాద్‌ అందరిదీ అన్నారు. ఇక్కడ దేశంలోని అన్ని నగరాల నుంచి వచ్చిన వారున్నారని, వారంతా హైదరాబాదీయులే అన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

సెటిలర్‌ అన్న పదాన్ని వ్యతిరేకిస్తున్నానని, ఆ పదాన్ని తొలగించాలని, మేయర్‌ పీటం దక్కించుకోగానే మెట్రోరైలు నిర్మాణం వేగవంతం చేస్తామని, పేదలకు కేంద్ర సాయంతో రెండు పడక గదుల ఇళ్లు, ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభిస్తామని చెప్పారు. నగర సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై బిజెపితో చర్చలు కొనసాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+