కేటీఆర్ ను వదలని పాత కేసు
KTR: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫార్ములా ఇ-కార్ రేస్ అవినీతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మరో నోటీసు అందింది. అవినీతి నిరోధక విభాగం అధికారులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. బుధవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు.
ఫార్ములా ఇ కార్ రేస్ కేసులో గతంలో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సారథ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను ఇచ్చింది. ఇరు పక్షాల నుంచి వాదోపవాదాలను ఆలకించింది ఉన్నత న్యాయస్థానం. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ ఉదయం తుది ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు సైతం దీనిపై విచారణకు నిరాకరించింది.

ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా గతంలో దర్యాప్తు మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఇ-కార్ రేస్‌లో అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన వివరాలు, ఇతర అంశాలపై విచారణ చేపట్టారు ఈడీ అధికారులు.
ఫార్ములా ఇ- కార్ రేస్ నిర్వాహకులకు ఎవరి అనుమతులు లేకుండా 46 కోట్ల రూపాయలను పౌండ్ల రూపంలో హెచ్ఎండీఏ చెల్లించిందని, ఇది మున్సిపల్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిగా ఈ చెల్లింపులకు కేటీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందనేది అధికారుల వాదన.
దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం రాలేదు. క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీనితో దాన్ని వెనక్కి తీసుకోవాల్సొచ్చిందాయనకు. ఈ పరిణామాల మధ్య ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం చర్చనీయాంశమైంది.
ఇప్పుడు దీనిపై తాజాగా ఏసీబీ దృష్టి సారించింది. ఫార్ములా ఇ కేసులో బుధవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసు ఇచ్చింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యగా భావిస్తోన్నట్లు చెప్పారు. అయినప్పటికీ- చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని, దర్యాప్తు ఏజెన్సీలకు సహకరిస్తానని అన్నారు.
దీనికి కొంత సమయం కావాలని కేటీఆర్ కోరారు. యూకే, అమెరికాల్లో పర్యటించాల్సి ఉందని, దీనికి సంబంధించిన షెడ్యూల్ గతంలోనే ఖరారైందని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాలకు తాను హాజరు కావాల్సి ఉందని అన్నారు.
ఏసీబీ ఆదేశించిన విధంగా ఈ నెల 28వ తేదీన అంటే బుధవారం నాడు విచారణకు హాజరు కాలేనని, యూకే, అమెరికా పర్యటనల తరువాత వస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని లిఖితపూరకంగా ఏసీబీకి తెలియజేశానని అన్నారు. ఎటువంటి సంకోచం లేకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ విషయంలో అభినందించాలని ఎద్దేవా చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్‌లో రేవంత్ రెడ్డి పేరు రికార్డయిందని కేటీఆర్ గుర్తు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న రేవంత్ రెడ్డిపై ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా విమర్శలు చేయలేదని వ్యాఖ్యానించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఏసీబీ నుండి నోటీసు వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నారని, ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ చవకబారు ప్రతీకార రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications