వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 సీట్ల లక్ష్యం తో లోక్ సభ ఎన్నికల కథన రంగంలోకి కేటీఆర్ ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Elections 2019 : TRS Sketch Is Aimed At Capturing 16 Seats For 17 Seats | Oneindia Telugu

తెలంగాణ రాష్ట్రంలో భావి నాయకుడిగా టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేస్తున్నారు గులాబీ బాస్ కెసిఆర్. ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన కెసిఆర్, తనయుడు కేటీఆర్ ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి టిఆర్ఎస్ పార్టీలో తన తర్వాత కీలకమైన పాత్ర కేటీఆర్ దే అని ప్రకటించారు గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కేటీఆర్ కీలక భూమిక పోషించిన నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ కుమారుడిపై బరువైన బాధ్యతలు పెట్టారు కెసిఆర్.

<strong>ఏపీ డీజీపీ కి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ ... ఆయన అక్రమ నిర్మాణం కూల్చివేత </strong>ఏపీ డీజీపీ కి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ ... ఆయన అక్రమ నిర్మాణం కూల్చివేత

పార్లమెంట్ ఎన్నికల సమాయత్త సభలకు కేటీఆర్ .. కేటీఆర్ దృష్టిలో పడేందుకు నేతల పాట్లు

పార్లమెంట్ ఎన్నికల సమాయత్త సభలకు కేటీఆర్ .. కేటీఆర్ దృష్టిలో పడేందుకు నేతల పాట్లు

రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ ప్రచారంలోకి దిగారు. కేసీఆర్ కు బాగా అచ్చొచ్చిన కరీంనగర్ నుంచి కేటీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు .ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరు అంటే హరీష్ రావ్ అన్న పేరు ఠక్కున వినిపించేది. కానీ ఆ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఎవరు అంటే కేటీఆర్ అని పార్టీ నేతలందరూ చెబుతున్న పరిస్థితి. ఇక నేడు కరీంనగర్ లో జరుగుతున్న సభ ఎన్నికల సభను తలపించింది. గులాబీ పార్టీ ఇన్నర్ మీటింగ్ ప్రత్యర్థుల ఊహాలకు అందకుండా పోయింది. కరీంనగర్ లో నిర్వహించిన సదస్సు పార్లమెంటరీ స్థాయిదే ఐనా.. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అగ్రశ్రేణి నాయకులు తరలిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందరూ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోటానికి ఈ సభను వేదికగా చేసుకున్నారు.

వ్యూహాత్మకంగానే కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్

వ్యూహాత్మకంగానే కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్

కేటీఆర్ ను సీఎం చేయాలనే సంకల్పంతో కొడుకు ప్రాధాన్యత పెంచుకుంటూ వచ్చారు కేసీఆర్. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలవడం ద్వారా.. అవన్నీ కేటీఆర్ వల్లే వచ్చిందనే ఫీలింగ్ ప్రజల్లో కల్పించారు కేసీఆర్. ఆ తర్వాత మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ విజయపతాకం ఎగురవేసింది. ఇది కూడా కేటీఆర్ క్రెడిట్ లోకి వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కెసిఆర్ కేటీఆర్ కు అప్పచెప్పిన బాధ్యతలలో రెండు కీలక ఎన్నికలు సక్సెస్ చేశారు. ఇక మిగిలి ఉంది లోక్ సభ ఎన్నికలు. ఇవి కూడా పూర్తైతే..అన్ని ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు విజయం సాధించి పెట్టిన లీడర్ అవుతాడు కేటీఆర్.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక జరగనున్న లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక జరగనున్న లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం

లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 16 సీట్ల టార్గెట్ తో బరిలోగి దిగుతుంది. ఈ 16 సీట్లు సాధిస్తే.. కేటీఆర్ ఆధిపత్యానికి అడ్డుచెప్పే గొంతు, నాయకుడు టీఆర్ ఎస్ పార్టీలో ఉండకపోవచ్చు.అందుకే కేటీఆర్ కూడా 2019 లోక్ సభ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వస్తోన్న ఎన్నికలు కావడంతో.. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ని అగ్రపథాన నిలబెట్టి తన తండ్రికి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నారు కేటీఆర్. మరి కేటీఆర్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? నేటి నుండి పార్లమెంటు ఎన్నికల కదనరంగంలోకి కాలు పెడుతున్న కేటీఆర్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పార్టీలోని కీలక నాయకులను కలుపుకుపోయేలా పని చేస్తారా ? వేచి చూడాలి .

English summary
In the Lok Sabha elections TRS will be tied with a 16-seat Target. If these 16 seats are taken, KTR will be the boss in TRS party. That is why Ktr also thinks that the 2019 Lok Sabha polls are very prestigious. Since the party announced him as the working president of the party. He decided that he have to show his strength in lok sabha polls and that willbe impact on his leadership in the party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X