"మన ఊరు-మన బడి" లో భాగస్వాములవ్వండి - దత్తత తీసుకోండి : అమెరికాలో కేటీఆర్..!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికార పర్యటన కొనసాగుతోంది. అయన ఒక వైపు పలువురు పారిశ్రామిక ప్రముఖలతో సమావేశాలు కొనసాగిస్తూనే... మరో వైపు అమెరికాలో స్థిర పడిన ప్రవాస భారతీయులతో మమేకం అవుతున్నారు. తాజాగా.. ప్రవాస భారతీయులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట కార్యక్రమంలో తెలంగాణ సాధించిన పురోగతిని వివరించారు. స్వరాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన ఊరు - మన బడి లక్ష్యాలను కేటీఆర్ వారితో పంచుకున్నారు.
గ్రామాలను దత్తత తీసుకోండి
పుట్టిన గడ్డకు మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం ప్రారంభించిన ఈ పధకంలో భాగస్వాములు కావాలని కోరారు. అమెరికాలో స్థిర పడిన వారు తమ సొంత గ్రామాలను.. బడులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 40 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి.. ఇవాళ 5000 మెగావాట్లకు చేరింది. ఇవాళ రైతులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. ఏడేళ్లలోనే తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యం రెండింతలైంది. కరెంట్ సమస్యను పరిష్కరించి దేశానికే సీఎం కేసీఆర్.. ఓ దిక్సూచిలా నిలిచారని చెప్పుకొచ్చారు.
21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి
పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లో మంజూరు చేస్తున్నామని చెప్పారు. 19 వేలకు పైబడిన పరిశ్రమలకు అనుమతులివ్వడంతో.. 2.3 లక్షల కోట్ల రూపాయాల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని కేటీఆర్ వివరించారు. వీటి కారణంగా దాదాపుగా 16 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలోనే పూర్తిచేసిన ఘనత తెలంగాణకే దక్కిందని, దీని ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం.. దేశ ఆర్థిక వృద్ధిలో 4వ అతిపెద్ద వాటాదారుగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ గణాంకాలతో సహా వివరించారు.
పెట్టుబడుల పైన ఒప్పందాలు
పెట్టుబడి దారుల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారితో పంచుకున్నారు. ఐటీసర్వ్ అలయన్స్ సంస్థ ప్రతినిదులతో సమావేశం నిర్వహించారు. అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటుచేయాల్సిందిగా కేటీఆర్ వారిని కోరారు. ఈ పర్యటనలో కొన్ని ఒప్పందాల పైన ప్రాధమికంగా అవగాహనలు కుదిరినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ పర్యటన ద్వారా తెలంగాణలో కొత్త పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications