KTR: కేటీఆర్ అరెస్ట్ అవుతారా..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరును ప్రస్తావించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇందలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, లగచర్ల గ్రాముస్థులు ఉన్నారు. ఈ దాడికి ప్రధాన కారణంగా భావిస్తున్న బోగమోని సురేశ్ నరేందర్ రెడ్డి 84 సార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడినట్లు గుర్తించారు.

ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఏ1గా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై కేటీఆర్ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. సురేశ్ టీఆర్ఎస్ నేత అని.. అతను నరేందర్ రెడ్డి ఫోన్ చేయకూడదా.. కలువకూడదా.. నరేందర్ రెడ్డి తనకు ఫోన్ చేయకూడదా అని ప్రశ్నించారు. దీంతో బుధవారం రాత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ బంజారాహిల్స్ నంది నగర్ లోని కేటీఆర్ ఇంటికి భారీగా చేరుకున్నారు.

KTR is likely to be arrested in the Vikarabad Lagacharla incident

గురువారం ఉదయం వరకు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం కేటీఆర్ ఇంటికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి కలశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కేటీఆర్ ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. మరోవైపు కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేస్ సంబంధించి ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆయన్ని విచారించడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఏదో ఒక కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇదంతా జరుగుతున్నా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించడం లేదు. కేటీఆర్ అరెస్ట్ చేస్తే సింపతి పెరుగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే తప్పేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలో రుణ మాఫీ కాక లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మీద కాకుండా ఇతర విషయాలపై పార్టీలు దృష్టి పెట్టడం బాధకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+