వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబూ గుర్తుందా? నాటి ఆణిముత్యాలు!: ఏకిపారేసిన కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ముందస్తు ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీ కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో(2014 నాటి) కాంగ్రెస్‌పై చంద్రబాబు చేసిన ట్వీట్స్‌ స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తూ మహాకూటమి పొత్తుపై నిలదీశారు కేటీఆర్.

బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ.కోటి నష్టం: వివరించిన హరీశ్, ఈ ప్రశ్నలకు సమాధానముందా?బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ.కోటి నష్టం: వివరించిన హరీశ్, ఈ ప్రశ్నలకు సమాధానముందా?

అప్పుడు ఇటాలియన్ మాఫీయారాజ్..

కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాలనకు ప్రజలు ముగింపు పలుకునున్నారని, ఈ విషయం తన ప్రజాగర్జన ద్వారా తెలిసిందని, ఇటాలియన్‌ మాఫియా రాజ్‌ కథ ముగిసిందని చంద్రబాబు అప్పట్లో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసిన కేటీఆర్‌.. ‘ఆ ఇటాలియన్‌ మాఫియా రాజ్‌ అతను ఇప్పుడు జిగ్రీ దోస్తులయ్యారు. అతనెవరో చెప్పుకోండి? ఇప్పుడు తెలిసిందా? నేను ‘మహాఘటియాబంధన్‌' అని ఎందుకు పిలుస్తానో' అని పేర్కొన్నారు.

బాబుగారి మరో ఆణిముత్యం..

‘రాహుల్‌, సోనియాలకు కొత్తగా తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో కూడా తెలంగాణలో వారు పర్యటించారు. అప్పుడు తెలంగాణ అభివృద్దికి ఏం చేశారు' అని ప్రశ్నిస్తూ చంద్రబాబు గతంలో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను షేర్‌ చేసిన కేటీఆర్‌.. ‘బాబుగారి మరో జ్ఞాన ఆణిముత్యం.. స్కామ్‌కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌లు 2014 వరకు తెలంగాణ అభివృద్దికి చొరవ చూపలేదనకుంటే.. అప్పటి నుంచి ఇప్పటికి ఏం మారింది?' అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేగాక, ఇంకా పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావ్‌ అని చంద్రబాబును నిలదీశారు.

చంద్రబాబు అప్పుడేమన్నారంటే..

అవినీతిమయమైన కాంగ్రెస్ నుంచి దేశాన్ని రక్షించడమే తమ ముందున్న లక్ష్యమని, ఇందుకు కావాల్సిన పని చేస్తామని, నిస్వార్థ పొత్తులకు ప్రాధాన్యతనిచ్చే తమను చరిత్ర గుర్తిస్తుందని చంద్రబాబు నాయుడు గతంలో ట్వీట్ చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. బాబు నాటి వ్యాఖ్యలపై కేటీఆర్.. ఎమోజీలను పెట్టి చివరి వ్యాఖ్యలను గమనించాలంటూ వ్యంగ్యాంగా స్పందించారు.

ఇప్పుడు కాంగ్రెస్-టీడీపీ పొత్తునేమంటారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమని కాంగ్రెస్, టీడీపీలు అంగీకరించిన తర్వాతే 2004, 2009లో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ల అక్రమ పొత్తుకు కారణమేంటని ప్రశ్నించారు. ఇదో అవకాశవాద, అధికార దాహంతో కూడిన రాజకీయమని విమర్శించారు.

English summary
Telangana minister KT Rama Rao on Tuesday lashed out TDP president and Andhra Pradesh CM Chandrababu Naidu for mahakutami issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X