హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తన చిన్నప్పుడు స్కూల్ వద్ద ఐస్ గోలా అమ్మిన తాతను కలిసిన కేటీఆర్, సాయం చేస్తానని హామీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు తాను స్కూల్లో చదువుకునే సమయంలో ఐస్ గోలాలు అమ్మిన తాతకు ప్రభుత్వం తరఫున సాయమందించేందుకు ముందుకు వచ్చారు. చిన్నప్పుడు గ్రామర్ స్కూల్లో చదివిన సమయంలో తనకు ఐస్ గోలా అమ్మిన తాత సయ్యద్ అలీని కేటీఆర్ కలిశారు. వృద్దాప్యంతో పని చేయలేని స్థితిలో ఉన్న అతనిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఉండేందుకు ఇల్లు, వృద్దాప్య పింఛన్ ఇప్పిస్తానని చెప్పారు.

ఐస్ గోలా వ్యక్తిని క్యాంప్ కార్యాలయంలో కలిసిన కేటీఆర్

ఐస్ గోలా వ్యక్తిని క్యాంప్ కార్యాలయంలో కలిసిన కేటీఆర్

రెండు వారాల క్రితం మహబూబ్ అలీ అనే యువకుడు కేటీఆర్‌కు ఒక ట్వీట్ చేశాడు. "కేటీఆర్ సాబ్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్ గోలా అమ్మిన వ్యక్తి (చావూష్) మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు" అని.

వెంటనే స్పందించిన కేటీఆర్ "తప్పకుండా కలుస్తాను. చావూష్ గురించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి" అని బదులిచ్చారు.

ఎప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం ఆబిడ్స్‌లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూళ్లో తను చదువుకునే సమయంలో స్కూల్ ముందు ఐస్ గోలా అమ్ముకునే సయ్యద్ అలీని ఈ రోజు (గురువారం) కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశాడు.

ఆలింగనం, కుశల ప్రశ్నలు

ఆలింగనం, కుశల ప్రశ్నలు

సయ్యద్ అలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు అడిగారు. 'ఇంకా ఐస్ గోలా అమ్ముతున్నావా, కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది' అనిప్రశ్నలు అడిగారు.

తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని, గత సంవత్సరమే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, అయినా పొట్ట గడవడం కోసం ఇంకా ఆబిడ్స్ గ్రామర్ స్కూల్ వద్ద ఐస్ గోలాలు అమ్ముతున్నానని సయ్యద్ అలీ బదులిచ్చాడు.

సయ్యద్ అలీకి ఉండడానికి ఇల్లు కూడా లేదని మాటల్లో తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించి మీకు వెంటనే ఒక ఇల్లు మంజూరు చేపిస్తానని మాట ఇచ్చారు.

సాయం చేస్తానని హామీ

సాయం చేస్తానని హామీ

అలాగే నెలవారీ వృద్దాప్య పెన్షన్ మంజూరు చేపిస్తానని, అతని కొడుకులకు కూడా సరైన ఉపాధి చూపిస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడారు.

కేటీఆర్ గురించి చాలా విన్నానని, కానీ నిజంగా ఇలా కలుస్తానని తానెప్పుడూ అనుకోలేదని ఈ సందర్భంగా సయ్యద్ అలీ అన్నారు. తన బాధలు విన్న వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కేటీఆర్ కు సయ్యద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Telangana Rastra Samithi working president KT Rama Rao on wednesday met Ice Gola seller at camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X