హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ: 18కంపెనీల సీఈవోలతో భేటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/సింగపూర్: పెట్టుబడుల ఆకర్షణకు సింగపూర్‌లో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు బుధవారం బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మించనున్న ఫార్మాసిటీ ప్రణాళికలో సింగపూర్‌కు చెందిన సుర్బానా- జురాంగ్‌ సంస్థ భాగస్వామ్యం కావాలని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌ నగరంలో బహుళ అంతస్తుల భవన ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

బుధవారం సింగపూర్‌లో సుర్బానా-జురాంగ్‌ సంస్థ సీఈవో టియో ఏంగ్‌ చాంగ్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ మేరకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని నగరంలో రోడ్లు, విద్యుత్తు, నీటిసరఫరా, ట్రాఫిక్‌ నిర్వహణ కోసం అధ్యయనం చేయాలని ఆహ్వానించారు. సింగపూర్‌ నుంచి ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని కేటీఆర్‌కు చాంగ్‌ హామీ ఇచ్చారు

కాగా, సింగపూర్‌లోని ఏస్టార్ (ఏజన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసర్చ్) కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకారం కుదిరింది. తెలంగాణలో పరిశ్రమలు, ఐటి తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు (కెటిఆర్) సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఏస్టార్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'రిచ్' (రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)తో కలిసి పనిచేసేందుకు ఏస్టార్ సూత్రప్రాయంగా అంగీకరించింది.

ఈ ఒప్పందం ద్వారా పరిశోధన, ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్, వాణిజ్యరంగాల్లో కలిసి పనిచేసేందుకు వీలవుతుంది. ఇలాఉండగా తెలంగాణ, సింగపూర్ విద్యార్థుల మధ్య ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో జరుగుతున్న పరిశోధన, చిన్న పరిశ్రమల పరిస్థితిపై కెటిఆర్ ఈ సందర్భంగా వివరించారు. సింగపూర్‌లోని భారత హైకమిషనర్ విజయ్ ఠాకూర్‌సింగ్‌తో కెటిఆర్ సమావేశమయ్యారు.

తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు తొలి విదేశీ పర్యటన సింగపూర్‌తో 2014లో ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగపూర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ఆమె కొనియాడారు. కెటిఆర్ మొదట సింగపూర్‌లో పబ్లిక్ హౌజింగ్ అవసరాలను పర్యవేక్షిస్తున్న సుర్బానా జురోంగ్ కంపెనీ సిఇఓ టియో ఏంగ్ చాంగ్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణలో పెద్దఎత్తున హౌజింగ్ కార్యక్రమాలను చేపడుతున్నట్టు కెటిఆర్ వివరిస్తూ, హైదరాబాద్‌లో ఒక మల్టీస్టోర్‌డ్ బిల్డింగ్ ప్రాజెక్టు చేపట్టాలని చాంగ్‌ను కోరారు. ఇందుకోసం కొంత స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో చేపడుతున్న ఫార్మా సిటీ ప్లానింగ్‌లో మౌలిక వసతుల విషయంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

18 కంపెనీలతో సమావేశం

భారత హైకమిషనర్, సిఐఐ ఆధ్వర్యంలో హైకమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిజినెస్ సెషన్‌లో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 సింగపూర్ కంపెనీలతో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానం, ఐటి పాలసీల గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు 2200 కంపెనీలకు ఇచ్చిన అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడులకు సానుకూలమైన ప్రాంతమని స్పష్టం చేశారు. పారదర్శకత, వేగంగా పనిచేయడం తమ ప్రభుత్వ ప్రత్యేకతలని వివరించారు. మంత్రి వెంట పరిశ్రమల ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉన్నారు.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

పెట్టుబడుల ఆకర్షణకు సింగపూర్‌లో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు బుధవారం బిజీబిజీగా గడిపారు. సింగపూర్‌లోని ఏస్టార్ (ఏజన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసర్చ్) కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకారం కుదిరింది.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

తెలంగాణలో పరిశ్రమలు, ఐటి తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు (కెటిఆర్) సింగపూర్‌లో పర్యటిస్తున్నారు.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

ఈ సందర్భంగా బుధవారం ఆయన ఏస్టార్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రిచ్' (రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)తో కలిసి పనిచేసేందుకు ఏస్టార్ సూత్రప్రాయంగా అంగీకరించింది.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

ఈ ఒప్పందం ద్వారా పరిశోధన, ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్, వాణిజ్యరంగాల్లో కలిసి పనిచేసేందుకు వీలవుతుంది. ఇలాఉండగా తెలంగాణ, సింగపూర్ విద్యార్థుల మధ్య ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని నిర్ణయించారు.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సౌత్ ఇండియా బిజినెస్ అచీవర్స్ అవార్డులను 12 మందికి కెటిఆర్ వేరొక సమావేశంలో అందచేశారు.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

ఎకనమిక్ టైమ్స్, ఎర్స్ట్ అండ్ యంగ్ భాగస్వామ్యంతో సౌత్ ఇండియా బిజినెస్ అచీవర్స్ అవార్డులను ఇస్తున్నారు. 200 మందికి పైగా కంపెనీల సిఇఓలు, ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

తెలంగాణలో జరుగుతున్న పరిశోధన, చిన్న పరిశ్రమల పరిస్థితిపై కెటిఆర్ ఈ సందర్భంగా వివరించారు. సింగపూర్‌లోని భారత హైకమిషనర్ విజయ్ ఠాకూర్‌సింగ్‌తో కెటిఆర్ సమావేశమయ్యారు.

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు తొలి విదేశీ పర్యటన సింగపూర్‌తో 2014లో ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగపూర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ఆమె కొనియాడారు.

 సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

సింగపూర్‌లో కెటిఆర్ బిజీ

కెటిఆర్ మొదట సింగపూర్‌లో పబ్లిక్ హౌజింగ్ అవసరాలను పర్యవేక్షిస్తున్న సుర్బానా జురోంగ్ కంపెనీ సిఇఓ టియో ఏంగ్ చాంగ్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణలో పెద్దఎత్తున హౌజింగ్ కార్యక్రమాలను చేపడుతున్నట్టు కెటిఆర్ వివరిస్తూ, హైదరాబాద్‌లో ఒక మల్టీస్టోర్‌డ్ బిల్డింగ్ ప్రాజెక్టు చేపట్టాలని చాంగ్‌ను కోరారు. ఇందుకోసం కొంత స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో చేపడుతున్న ఫార్మా సిటీ ప్లానింగ్‌లో వౌలిక వసతుల విషయంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

English summary
Minister for IT, Industries and Municipal Administration and Urban Development K.T. Rama Rao, who is touring Singapore to attract investment to the State, met several top industry representatives on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X