కెటిఆర్ డైనమిక్ లీడర్: కేంద్రమంత్రి ప్రశంస, ఢిల్లీలో బిజీ(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ డైనమిక్ లీడర్ అని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా వ్యాఖ్యానించారు.చిన్న మధ్య తరహా పరిశ్రమలపై లోతైన అవగాహన ఉందని, ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపించడానికి ఎంతో చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. కేంద్ర పథకాల అమలులో ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులను, నిబంధనల్లో ఉన్న సంక్లిష్టత కూడా పరిశ్రమలకు ఇబ్బందికరంగా ఉందని సూటిగా చెప్పారని అన్నారు.

తప్పకుండా ఈ దిశగా తెలంగాణతో కలిసి సమిష్టిగా మూతపడిన పరిశ్రమలను తెరిపించడానికి, ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్థిక సాయం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రిని కలుసుకొని తెలంగాణలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

ఈ పరిశ్రమల కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయాలనే నూతన ఆలోచనను ప్రతిపాదించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు వృద్ధి చెందడానికి వీలున్న మార్గాలపై వివరించారు. మూతపడినవాటిని తెరిపించడం ద్వారా పారిశ్రామికంగా జరిగే అభివృద్ధి గురించి తెలిపారు.

అనంతరం కేంద్రమంత్రి కల్‌రాజ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పది నెలల తరువాత మూతపడిన చిన్న మధ్య తరహా పరిశ్రమల పునరుద్ధరణ కోసం ఒక నోటిఫికేషన్‌ను ఇచ్చానని, పరిశ్రమలు గరిష్ఠంగా పది లక్షల రూపాయల విలువైన ఆస్తులు ఎన్పీఏ (నాన్ పెర్‌ఫార్మింగ్ అసెట్స్) కలిగి ఉండి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్లయితే రుణ సాయం చేసి ఆదుకోడానికి రిజర్వు బ్యాంకు ముందుకొచ్చిందని, అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యలపై చర్చించి ఒక విధాన నిర్ణయాన్ని రూపొందించనున్నట్లు స్పష్టం చేసిందని మంత్రి గుర్తుచేశారు.

ఇందులో భాగంగా బ్యాంకు మేనేజర్లతో కూడా మాట్లాడడానికి ప్రతిపాదన చేసిందని చెప్పారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి గురించి ఇప్పటికే దేశంలో చాలా చోట్ల సదస్సులు జరిగాయని, హైదరాబాద్‌లో ప్రాంతీయ సదస్సు జరిపించడానికి కేటీఆర్ ఒక ప్రతిపాదన చేశారని, దీన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు.

హైదరాబాద్‌లో జరిగే ప్రాంతీయ సదస్సుకు పొరుగు రాష్ట్రాలను కూడా భాగస్వాములయ్యేలా చూస్తానని, దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులు, కార్యదర్శులతో పాటు ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతానని కేంద్రమంత్రి చెప్పారు. హైదరాబాద్ ప్రాంతీయ సదస్సుకు తానుకూడా హాజరవుతానని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంత ఎక్కువగా ఉంటే ఈ రంగానికి సంబంధించిన సమస్యలు అంత త్వరగా పరిష్కారమవుతాయని, సమిష్టి కృషితో ఈ పరిస్థితిని అధిగమించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లోని మూతపడిన చిన్న మధ్య తరహా పరిశ్రమలను తెరిపించడంపై కేంద్రం తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందని తెలిపారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను, మూతపడినవాటిని తెరిపించడానికి చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి చాలా సానుకూలంగా స్పందించారని, హైదరాబాద్‌లో జరిగే ప్రాంతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉందని వివరించారని, త్వరలోనే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

పారిశ్రామికవేత్తలతో కెటిఆర్ వరుస భేటీలు

తెలంగాణలో పెట్టుబడులకు సహకరించాలని జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా రాయబారులకు రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తిచేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం దిల్లీ వచ్చిన కేటీఆర్‌ పలువురు రాయబారులు, కేంద్రమంత్రి కల్‌రాజ్‌మిశ్రాలతో భేటీ కావడంతోపాటు భారతి ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌, హడ్కో సీఎండీ రవికాంత్‌లతో సమావేశమయ్యారు.

కేంద్రమంత్రితో కెటిఆర్

కేంద్రమంత్రితో కెటిఆర్

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ డైనమిక్ లీడర్ అని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా వ్యాఖ్యానించారు.
చిన్న మధ్య తరహా పరిశ్రమలపై లోతైన అవగాహన ఉందని, ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపించడానికి ఎంతో చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు.

కేంద్రమంత్రితో కెటిఆర్

కేంద్రమంత్రితో కెటిఆర్

కేంద్ర పథకాల అమలులో ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులను, నిబంధనల్లో ఉన్న సంక్లిష్టత కూడా పరిశ్రమలకు ఇబ్బందికరంగా ఉందని సూటిగా చెప్పారని అన్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కెటిఆర్

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కెటిఆర్

తెలంగాణలో పెట్టుబడులకు సహకరించాలని జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా రాయబారులకు రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తిచేశారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కెటిఆర్

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కెటిఆర్

రెండురోజుల పర్యటన నిమిత్తం దిల్లీ వచ్చిన కేటీఆర్‌ పలువురు రాయబారులు, కేంద్రమంత్రి కల్‌రాజ్‌మిశ్రాలతో భేటీ కావడంతోపాటు భారతి ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌, హడ్కో సీఎండీ రవికాంత్‌లతో సమావేశమయ్యారు.

సునీల్ భారతీ మిట్టల్‌తో కెటిఆర్

సునీల్ భారతీ మిట్టల్‌తో కెటిఆర్

అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించిన వారిని కలిసి పలు అంశాలపై చర్చించానని కేటీఆర్‌ తెలిపారు.

సునీల్ భారతీ మిట్టల్‌తో కెటిఆర్

సునీల్ భారతీ మిట్టల్‌తో కెటిఆర్

జపాన్‌ ఉపరాయబారి యుపక కికుతా, మలేసియా ఉప ప్రధాని అహ్మద్‌ జాహిద్‌ హమిది, తైవాన్‌ రాయబారి చుంగ్‌ కవాంగ్‌, దక్షిణ కొరియా రాయబారి హ్యూయాన్‌ చోలను కలిశానని, త్వరలో వారి దేశాల్లో పర్యటించనున్నట్లు తెలిపి సహకరించాలని కోరానన్నారు. వారి వారి దేశాలకు చెందిన, భారత్‌వైపు చూస్తున్న పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని కోరానన్నారు.

మలేషియా డిప్యూటీ పీఎంతో కెటిఆర్

మలేషియా డిప్యూటీ పీఎంతో కెటిఆర్

పరిశ్రమల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల్ని వివరించానని, వారంతా సానుకూలంగా స్పందిచారని తెలిపారు.

తైవాన్ రాయబారితో కెటిఆర్

తైవాన్ రాయబారితో కెటిఆర్

ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి రంగాన్ని తెలంగాణకు తీసుకొచ్చే క్రమంలో జపాన్‌ రాయబారితో చర్చించానన్నారు. అలాగే దక్షిణ కొరియా, మలేసియా, తైవాన్‌ పర్యటనల గురించి తెలిపి, ఆయా దేశాల ప్రతినిధులకు తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన అంశాలను వివరించానన్నారు.

సౌత్ కొరియా రాయబారితో కెటిఆర్

సౌత్ కొరియా రాయబారితో కెటిఆర్

హడ్కో ఛైర్మన్‌ రవికాంత్‌తో భేటీ సందర్భంగా.. మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌లో ఫార్మాసిటీకి రూ.745 కోట్లు రుణం ఇవ్వాలని కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే రుణ సౌకర్యం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

జపాన్ రాయబారితో కెటిఆర్

జపాన్ రాయబారితో కెటిఆర్

భారతి ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌తో భేటీ సందర్భంగా హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపానన్నారు. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్‌ను యాంకర్‌ క్లయింటు భాగస్వామిగా రావాలని కోరానని చెప్పారు. దీనిపై తమ సంస్థకు చెందిన ప్రతినిధుల్ని పంపి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని మిత్తల్‌ హామీ ఇచ్చారన్నారు.

జపాన్ రాయబారితో కెటిఆర్

జపాన్ రాయబారితో కెటిఆర్వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వహించిన డిజిటల్‌ సదస్సులో పాల్గొని తెలంగాణలో డిజిటల్‌ మౌలిక వసతులు, డిజిటల్‌ అక్షరాస్యత గురించి వివరించానని కేటీఆర్‌ తెలిపారు. వాటర్‌గ్రిడ్‌తో ఫైబర్‌గ్రిడ్‌ అనుసంధానం చేస్తున్న విధానం, తెలంగాణ ప్రగతిశీల విధానాలు తెలిపానన్నారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీలతో బుధవారం భేటీ కానున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister K. Taraka Rama Rao met diplomats of Japan, South Korea and Taiwan in New Delhi on Tuesday seeking their cooperation for routing investments to Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి