అమిత్ షా కు కేటీఆర్ బహిరంగలేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్!!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేడు సాగనుంది. ఈ నేపధ్యంలో బీజేపీ నేతలు అమిత్ షా పర్యటనకు, తుక్కుగూడ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇక అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్రాన్ని మరోమారు టార్గెట్ చేసిన టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అమిత్ షా కు బహిరంగ లేఖ రాసి సమాధానం చెప్పాలంటూ పలు ప్రశ్నలను సంధించారు.

అమిత్ షా రాకను టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఈరోజు సాయంత్రం తుక్కుగూడ లో నిర్వహించనున్న బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా రాకను టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపై కేటీఆర్ ఆ లేఖ ద్వారా ప్రశ్నలను సంధించారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ... అమిత్ షా కు ప్రశ్నాస్త్రాలు
రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీ కక్ష, వివక్ష అలాగే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి, పత్తా లేకుండా పోవడం బిజెపి నాయకులకు అలవాటుగా మారింది అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆయన మంత్రి అమిత్ షా కు సూటి ప్రశ్నలు సంధించారు. బహిరంగ లేఖలో కేటీఆర్ సంధించిన ప్రశ్నల వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీని అయినా కేంద్రం నెరవేర్చిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై నిలదీసిన కేటీఆర్
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీకి ఎందుకు తప్పు పట్టించారని , కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని, కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ లో ఎలా వస్తుంది అంటూ నిలదీశారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి అడ్డుకునేందుకు ఐటీఐఆర్ రద్దు చేయడం బిజెపి చేసిన కుట్ర కాదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉందని, అలాంటి తెలంగాణకు సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు ఎందుకు ఇవ్వరు అంటూ అమిత్ షా ను నిలదీశారు. ఇక నవోదయ, ఐఐఎం, ఐసర్ విద్యాలయాలు తెలంగాణాకు ఎందుకు కేటాయించలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

కృష్ణానది యాజమాన్య బోర్డు అనేది శిఖండి సంస్థ.. మండిపడిన కేటీఆర్
పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని కెసిఆర్ తన లేఖ ద్వారా అమిత్ షా కు ప్రశ్నాస్త్రాలు సంధించారు. సాగునీటి హక్కులు దక్కకుండా చేస్తున్న తాత్సారం పై ఏం చెబుతారని నిలదీశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్థను ఏర్పాటు చేసి సాగునీటి జలాల హక్కులు దక్కకుండా తాత్సారం చేస్తున్న మీరు, వివక్ష తీరుపై ఏం చెప్తారు అంటూ కెసిఆర్ ఓ రేంజ్ లో అమిత్ షా కు ప్రశ్నాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ఎందుకు సహాయం అందించడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణాలో ఐటీ అభివృద్ధికి మీరు చేసిన ఒక్క కార్యక్రమం చెప్పగలరా ?
డిఫెన్స్ కారిడార్ ను ఎందుకు మంజూరు చేయడం లేదని నిలదీశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక మెడికల్ కళాశాల కూడా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలను తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐటీ అభివృద్ధి కోసం మీరు చేపట్టిన ఒక కార్యక్రమం చెప్పగలరా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications