కేటీఆర్ తాజా నిర్ణయం వెనుక - మారుతున్న లెక్కలు..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసెంబ్లీ జరుగుతున్నవేళ అధికార - ప్రధాన ప్రతిపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెండు కీలక బిల్లుల ను సభలో ప్రవేశ పెట్టేందుకు సిద్దమయ్యారు. బుధవారం సభలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనుంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ నిర్ణయం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
కేటీఆర్ తాజా నిర్ణయం
మాజీ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ 25 వ వార్షికోత్సవం వేళ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్దం అవుతోంది. జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైంది. ఇప్పటి కే మాజీ సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో లక్షలాదిమంది పాల్గొననున్న భారీ బహిరం గ సభను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

కేడర్ తో సమావేశం
పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం పైన ప్రజా పోరాటాలకు సిద్దం కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావటంతో ఇక నిరసనల నిర్వహణ దిశగా కార్యాచ రణ సిద్దం చేస్తోంది. వీటి నిర్వహణ పైన కేటీఆర్ పార్టీ శ్రేణులకు, జిల్లా నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ స్వయంగా మార్గదర్శనం చేయనున్నారు. ఇప్పటికే కేటీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ పైన స్పష్టత ఇచ్చారు. మార్చి 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం బడ్జెట్ సభ ముందుకు రానుంది. ఈ నెల 27తో అసెంబ్లీ ముగుస్తుంది. ఆ తరువాత కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిం చేలా కార్యచరణ ఖరారు చేస్తున్నారు. ఈ పర్యటనల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీ కేడర్ ను సమాయత్తం చేయటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వరంగల్ లో జరిగే సభ ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయనున్నారు. పార్టీ కేడర్ తో వరుస సమావేశాల ద్వారా తిరిగి జోష్ పెంచేలా కార్యక్రమాల నిర్వహణకు పార్టీ సిద్దం అవుతోంది. అందు లో భాగంగా అన్ని జిల్లాల్లో పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. వరంగల్ లో రాష్ట్ర స్థాయి సభకు నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు కేటీఆర్ పర్యటనతో రాజకీయంగా మరోసారి ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications