చక్రం తిప్పిన కెటిఆర్: బరి నుంచి తప్పుకున్న రెబెల్స్
హైదరాబాద్: రెబెల్స్‌ను పోటీ నుంచి తప్పించడంలో తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కెటి రామారావు విజయం సాధించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో నామినేషన్లు వేసిన రెబెల్స్‌లో 90 శాతం మంది నేతలు వెనక్కి తగ్గారు. కెటిఆర్ స్వయంగా మాట్లాడి వారి చేత నామినేషన్లు ఉపసంహరింపజేశారు.
గనామినేషనల ఉపసంహరణకు ఆఖరు రోజైన గురువారం దాదాపు 90 శాతం మంది అంటే 600 మందికి పైగా రెబెల్స్‌ను పోటీ నుంచి తప్పుకునేలా కెటిఆర్ మంత్రాంగం నడిపారు. టిడిపి, బిజెపి రెబెల్స్ తీవ్ర ఆగ్రహంతో పార్టీలను వీడుతున్న క్రమంలో తెరాస మాత్రం తన రెబెల్స్‌ను రంగం నుంచి తప్పుకునేలా అగీకరింపజేసింది.
పార్టీ టికెట్ రానివారిని, రెబెల్స్‌గా రంగం నుంచి తప్పుకున్నవారిని మంత్రి తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. అభ్యర్థులుగా పార్టీ ఎంపిక చేసిన వారికి సైతం మంత్రి నేరుగా ఫోన చేసి టికెట్ రాని వారిని కలుపుకొని పోవాలని సూచించారు. నామినేషన్ల గడువు పూర్తికాగానే రంగంలోకి దిగిన కేటీఆర్ డివిజన్ల వారీగా సమన్వయ కర్తలను నియమించి పార్టీ తరపున నామినేషనలు వేసిన అభ్యర్ధులను గుర్తించారు. వారందరితో స్థానిక నాయకులు మాట్లాడాల్సిందిగా ఆదేశించారు.

వీరే కాకుండా ఆయా నియోజకవర్గాలకు ఇనచార్జిలుగా నియమించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా స్థానిక నాయకులతో మాట్లాడాలని కోరారు. అందరికీ భరోసా ఇచ్చేలా ప్రత్యేకంగా మూడు రోజుల పాటు రెబెల్స్‌తో, నాయకులతో చర్చలు జరిపిన కెటిఆర్ అందరినీ క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. రెబెల్ అభ్యర్ధులతో చర్చల్లో భాగంగా మంత్రి కేటీఆర్ 40 డివిజన్ల నాయకులతో, దాదాపు 120 డివిజన్లలోని రెబెల్స్‌తో నేరుగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications