వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీధుల గుండా తిరుగుతూ గణపతిపై ముస్లీం దంపతుల ప్రచారం, కెటిఆర్ మెచ్చుకోలు

నాలుగేళ్లుగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ వినాయ‌కుడి విగ్ర‌హాలు కాకుండా మ‌ట్టి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించాల‌ని వినూత్న రీతిలో ప్ర‌చారం చేస్తున్న ముస్లిం దంప‌తుల‌ను మంత్రి కేటీఆర్ మెచ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాలుగేళ్లుగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ వినాయ‌కుడి విగ్ర‌హాలు కాకుండా మ‌ట్టి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించాల‌ని వినూత్న రీతిలో ప్ర‌చారం చేస్తున్న ముస్లిం దంప‌తుల‌ను మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు.

వీరి గురించి తెలియజేస్తూ ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాకు చెందిన మ‌హ్మ‌ద్ సుభానీ, స‌లీమాల గురించి స్థానికంగా చాలామందికి తెలుసు.

సుభాన్ ధోతి ధ‌రించి, చొక్కా లేకుండా, శ‌రీరం మొత్తం మ‌ట్టి రంగు రుద్దుకుని, మ‌ట్టి వినాయ‌కుడి ఆకారంలో చేసిన త‌ల‌ మాస్క్‌ను ధ‌రించి రిక్షా మీద గ‌ణ‌ప‌తి లాగా కూర్చుంటాడు.

ఆ రిక్షాను స‌లీమా వీధుల గుండా తోసుకుంటూ వెళ్తారు. మ‌ట్టి వినాయ‌కుడి ప్రాముఖ్య‌త‌ను వివరిస్తారు. వీరు ప్రతి ఏడాది వినాయ‌క చ‌వితికి ఇలా వినూత్న రీతిలో ప్రచారం చేస్తుంటారు.

ఖైరతాబాద్ గణపతికి హైసెక్యూరిటీ

ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకు హైసెక్యూరిటీ కల్పిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డిసిపి జోయెల్ డేవిస్ ఖైరతాబాద్ గణేశుడు దేశంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, తమిళనాడులోని తన స్వస్థలమైన కన్యాకుమారిలో ఈ గణేషుడి గురించి చెప్పుకునే వారని గుర్తు చేసుకున్నారు.

ప్రతి ఏడాది మాదిరిగానే లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, ఆ నేపథ్యంలో బయట నుంచి వచ్చే వారికి, స్థానికులకు రక్షణ కల్పించేందుకు ముండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 300 మంది పోలీసు సిబ్బంది భద్రత చేపడతారని, ఇప్పటికే అనుమానితులను విచారిస్తున్నామన్నారు.

ఉగ్రవాదులు స్థానికంగా షెల్టర్ తీసుకునే అవకాశం ఉన్నందున డివిజన్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నామని తెలిపారు. 24 గంటల పాటు సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పాటు నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

English summary
'Mohd Subhani and Saleema from Mahabubabad took up the noble cause to promote Clay Ganesha. Been doing this from 2013 I believe' Minister KTR tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X