పన్ను కట్టాల్సిందే,30లక్షల దొడ్లు: కేటీఆర్(ఫోటోలు)

హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ గడచిన ఏడాదిలో సాధించిన ప్రగతిపై రూపొందించిన వార్షిక ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సచివాలయంలో విడుదలచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు

వచ్చే నాలుగేళ్లలో పరిశుభ్రమైన పల్లెలు కలిగిన తెలంగాణ కలను సాకారం చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో 30 లక్షల మరుగుదొడ్లను నిర్మిస్తామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. త్వరలోనే సర్పంచులకు చెక్‌ పవర్‌ కల్పించనున్నట్లు ప్రకటించారు. తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చిన తర్వాతనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

రానున్న రోజులలో ఉపాధి హామీ, పింఛన్లు, బీమా చెల్లింపులను పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా చేయనున్నామని మంత్రి తెలిపారు. పౌర సేవల మెరుగుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని జోడించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

వాటర్‌ గ్రిడ్‌ పథకం కింద రూ.15,603 కోట్లకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇచ్చిందని, త్వరలో మరో రూ.8 వేల కోట్లకు అనుమతులు లభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నడవాలంటే ప్రజలు పన్నులు కట్టాల్సిందేనని, పన్నులు కట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు.

 పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

వాటర్ గ్రిడ్ పనులను పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈపీసీ పద్ధతులకు స్వస్తి పలికామన్నారు. అదే సమయంలో పనుల నాణ్యత పరిశీలించేందుకు థర్డ్ పార్టీ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించామని తెలిపారు. రూ.1770 కోట్లతో వాటర్ గ్రిడ్‌లో భాగంగా చేపట్టే ఇన్‌టేక్ వెల్స్ సేఫ్‌సైడ్‌కు వచ్చేలా అధికారులు పట్టుదలతో పనిచేస్తున్నారని మంత్రి చెప్పారు.

 పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్


మన టీవీ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావల్సిన శిక్షణను నిపుణులతో ఇప్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో ఎస్సీ, ఎస్టీలకు జీవనోపాధులు కల్పించేందుకు తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో ఉత్పత్తులకు మార్కెట్ ధర కల్పించడం, జీవనోపాధుల పెంపువంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్


స్త్రీనిధిద్వారా ఈ ఏడాది రూ.1050 కోట్ల రుణాలు, స్వయం సహాయ బృందాలకు బ్యాంకులద్వారా రూ.3468కోట్ల బ్యాంకు లింకేజీ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. మిషన్ కాకతీయ పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడంతోపాటు రూ.160కోట్లతో డ్రైప్లాట్‌ఫాంల నిర్మాణం, గోడౌన్ల నిర్మాణం చేయనున్నామని పేర్కొన్నారు.

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

పంచాయతీరాజ్ శాఖద్వారా గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు, అభివృద్ధికి రూ.5470కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రజాపన్నులతో ప్రజల పనులు అన్న నినాదంతో బోర్డులు పెట్టాలని నిర్ణయించామని, అన్ని పనులలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. హరితహారం ద్వారా గ్రామీణ రోడ్లకు ఇరువైపులా 38లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు.

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

తెలంగాణలో పంచాయతీల పన్ను వసూలు దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్ అన్నారు. రాష్ట్రంలో వసూలుచేసిన పన్ను విధానాలపై కేస్‌స్టడీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. దీనిపై ఈ నెల 11, 12, 13తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు.

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్

పన్నులు కట్టాల్సిందే: కేటీఆర్


సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంవంతమైన పారదర్శక పాలన అందిస్తున్నదని కేటీఆర్ కొనియాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి తగు ప్రాధాన్యం ఇచ్చి, ఆసరా పథకం ద్వారా 36.50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, దీనికి ఇప్పటివరకు రూ.4వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+