సీఎంఆర్‌వై కింద సాయం అందింది!: వన్ఇండియా ఆర్టికల్‌కు స్పందించిన కేటీఆర్

హైదరాబాద్: నగరానికి చెందిన కె.శివ, సాయిప్రియలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ పాప ప్రీమెచ్యూర్‌గా పుట్టింది. ఏడో నెలలోనే నియోనేటల్ సమస్యలతో జన్మించింది. ఆ పాపను వెంటిలెటర్‌పై ఉంచారు. అప్పుడు నెల తర్వాత కూడా ఆ పాప హైదరాబాదులోని లిటిల్ స్టార్ చిల్డ్రన్ ఆసుపత్రిలోనే ఉంది. పాప విషయం తెలిసి సీఎంఆర్ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) నుంచి కొంత సహాయం అందింది. ఆ పాప పుట్టడంతోనే ఒళ్లంతా ట్యూబులు, సూదులతో వెంటిలెటర్‌పై ఉంది.

బక్కపలుచగా ఉండి, ముట్టుకుంటే ఏడ్చేది. పాపను బతికించుకునేందుకు తల్లిదండ్రులు శివ, సాయిప్రియలు ఎంతో కష్టపడ్డారు. నెలకు రూ.15 వేలు సంపాదించే శివకు పాపను కాపాడుకోవడం ఎంతో భారం అయింది. కూతురు కోసం పరితపించేవారు. పాప కోసం బంగారం సహా అన్ని అమ్ముకున్నారు. స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నారు. బేబీ కోలుకోవడానికి కావాల్సిన పెద్ద మొత్తం వారి వద్ద లేదు.
ఇలాంటి సమయంలో 'వన్ ఇండియా' కూడా తనవంతుగా, వారికి సాయం చేయాలంటూ పిలుపునిచ్చింది. వారికి చేయితనివ్వాలంటూ ప్రత్యేకంగా ఆర్టికల్ రాసి, సాయం కోరింది.
Surely will @KTRoffice please contact https://t.co/N8RfFoUxr2
— KTR (@KTRTRS) June 13, 2018
'పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి' అనే ఆర్టికల్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చూసి బుధవారం ట్వీట్ చేశారు. సహాయం కోసం తన కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా సూచించారు. పాపకు తప్పకుండా సాయం చేస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆ తర్వాత పాపకు సాయం చేసినట్లు మరో ట్వీట్ కూడా చేశారు. అంతకుముందే పాపకు సీఎంఆర్ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) నుంచి రూ.2 లక్షలు విడుదల చేసినట్లు తనకు ఇప్పుడే తెలిసిందని కేటీఆర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. పాపకు, అంతకుముందే అంటే, మే 30వ తేదీనే సహాయం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఇందుకు సంబంధించిన కాపీనీ ట్వీట్ చేశారు.
It has been just brought to my notice that we have already sanctioned Rs. 2 lakhs from CMRF pic.twitter.com/X2yFJqgskv
— KTR (@KTRTRS) June 13, 2018
మంత్రి కేటీఆర్ తన దృష్టికి వచ్చిన సమస్యపై వెంటనే స్పందిస్తున్నారు. ట్విట్టర్‌లో కూడా ఎవరైనా సమస్యను తన దృష్టికి తీసుకు వస్తే అధికారులను ఆదేశించడం లేదా అందుకు తగినట్లుగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పాప విషయం తమ దృష్టికి రావడంతో కేసీఆర్ కూడా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు విడుదల చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!