సారీ చెప్పి: చానళ్ల బ్యాన్‌పై కేటీఆర్, కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు జర్నలిస్టుల నిరసన సెగ తగిలింది. తెలంగాణ 100 రోజుల పాలనపై కేటీఆర్‌ మంగళవారం పర్యాటక భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ప్రసారాల నిషేధంపై నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్ మాట్లాడుతూ.. చానళ్ల ప్రసారాలు నిలిపివేతకు, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మీడియా తప్పు చేసి ఉంటే ఎంఎస్‌ఓలతో చర్చలు జరిపి, క్షమాపణలు చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పించుకుని ఎంఎస్‌ఓలతో చర్చలు జరిపాలని జర్నలిస్టులు కోరగా 600 చానళ్లు ఉన్నాయని, వాటి తరఫున ప్రభుత్వం మాట్లాడాలా? అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR responds on channals ban issue

తమకు సంబంధం లేని విషయాన్ని రుద్దవద్దని, అన్ని చానళ్లపైనా మేము వకల్తా పుచ్చుకోలేమన్నారు. చానళ్ల ప్రసారాల నిలిపివేతకు సంబంధించి ఆయా మీడియా ప్రతినిధులే ఎంఎస్‌ఓలతో చర్చలు జరుపుకోవాలని, క్షమాపణలు చెప్పుకుని చానళ్లు పునరుద్ధరించుకోవాలన్నారు.

కేసీఆర్‌ది నియంత పోకడ: కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీరు నియంత పోకడ తలపిస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన మంగళవారం ఖండించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ల ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమన్నారు.

మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా పోలీసులు తీరు దారుణమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. జర్నలిస్టుల ఆందోళనకు బీజేపి పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎంఎస్‌ఓలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. రెండు చానళ్లను పునరుద్ధరించకపోతే ఎంఎస్‌ఓలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలసి వస్తుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+