వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధ దంపతులకు సాయం: ఉత్తమ్‌కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ్ చేసిన ఒక ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఓ వృద్ద దంపతులకు వెంటనే సాయన్నందించేలా చేశారు.

కొమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని కర్జెల్లి ఎస్టీ కాలనీలో వృద్ధ దంపతులు నివాసముంటున్న గుడిసెకు స్థానిక అధికారులు రూ.500 ఇంటి పన్నును విధించారు. ఈ విషయాన్ని ఉత్తమ్‌ మంగళవారం సీఎంవో, మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

KTR responds on Uttam tweet

అధికారులు ఇచ్చిన రశీదు, వృద్ధులు గుడిసె ముందు ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. వృద్ధుల నుంచి వసూలు చేసిన పన్నును తిరిగి చెల్లించాలని, డబుల్‌బెడ్‌రూం ఇంటిని వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కాగా, ఉత్తమ్‌ ట్వీట్‌పై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్‌.. స్థానిక పంచాయతీ కార్యదర్శి చేసిన పొరపాటును సరిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వృద్ధ దంపతులకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లుతోపాటు ఆసరా పెన్షన్‌ వెంటనే మంజూరు చేయించాలని మంత్రి ఆదేశించారు.

English summary
Municipal and information technology minister KT Rama Rao swiftly responded to a tweet by TPCC president Uttam Kumar Reddy's tweet about a poor aged couple living in a hut in Asifabad Komarambheem district asked to cough up 500 towards property tax. Uttam tweeted that local officials apathy is sickening and appealed to the Chief Ministers Office and KTR to look into it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X