కేటీఆర్ ఆపన్న హస్తం: సహాయం కావాలని అడిగిన క్షణాల్లోనే!..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. తన దృష్టికి వచ్చే ప్రతీ సమస్యపై స్పందిస్తుంటారు. తాజాగా ట్విట్టర్ వేదికగా మరోసారి ఆయన తన ఉదారతను చాటుకున్నారు. సౌదీలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని తెలంగాణలోని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రానికి కులెరు దేవరాజు అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. సౌదీ అరేబియాలోని డామ్మమ్ లో అతను నివసిస్తున్నాడు. అక్కడి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న దేవరాజ్.. ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

విద్యాసాగర్ దొండ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దేవరాజు పనిచేసే కంపెనీ యాజమాన్యం ఎలాంటి సాయం అందించడం లేదని, దయచేసి మృతదేహాన్ని అతని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని ట్వీట్ చేశాడు.

విద్యాసాగర్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే కేటీఆర్ దానిపై స్పందించాడు. ప్రభుత్వం తరుపున కచ్చితంగా సహాయం చేస్తామని కేటీఆర్ హామి ఇచ్చారు. మృతదేహాన్ని బాధితుడి స్వస్థలానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకొంటామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana IT Minister KTR promised to help a family, their family member was died saudi arabia. Ktr said govt will help to bring his dead body

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి