KTR: పది స్థానాల్లో ఉప ఎన్నికలు.. కేటీఆర్ జోస్యం.. !

రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పది అసెంబ్లీ స్థానాల్లో బై పోల్ వస్తుందని జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రంగారెడ్డి జల్లా షాబాద్ లో బీఆర్ఎస్ దీక్ష నిర్వహించింది. ఈ దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫేస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలన్నారు.

ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీనే అమలయ్యిందని ఎద్దేవా చేశారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం కూడా సరిగా అమలు చేయడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.

KTR says by-elections are likely in ten seats

ఇప్పటికే ఎకరాకు రైతుకు రూ. 17500 ప్రభుత్వం బాకీ పడినట్లు పేర్కొ న్నారు. తెలంగాణలోని ప్రతీ మహిళకు రూ. 30 వేలు ప్రభుత్వం బాకీ పడిందని గుర్తు చేశారు. వందరోజుల్లోనే హామీలన్నీ అమలు చేశామని ఢిల్లీలో చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షల రుణం తీసుకోవాలని ఎన్నికల ముందు చెప్పారని పేర్కొన్నారు. రుణ మాఫీ ఇప్పటికీ కూడా పూర్తి చేయలేదని గుర్తు చేశారు. చాలా మంది రైతులు అధికారులు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారని చెప్పారు.

ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సవాల్ విసిరినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. రాజీవ్ అభయం హస్తం కాస్త భస్మాసుర అస్తమని కేటీఆర్ ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+