హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో స్త్రీనిధి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సూక్ష్మ రుణాలు ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని సూచించారు.

స్త్రీనిధి(శ్రీనిధి) పథకాన్ని తెలంగాణ పల్లె ప్రగతి పథకంతో అనుసంధానం చేస్తామన్నారు. మహిళలు తమ సేవింగ్స్‌ను పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇస్తున్నామన్నారు.

మహిళా సంఘాలు మరింతగా బలపడాలని, మహిళా శక్తికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. స్త్రీనిధి(శ్రీనిధి) బ్యాంకులో రూ.165 కోట్లు ప్రభుత్వం తరపున జమయ్యాయని స్పష్టం చేశారు. దేశంలో ఐదంచెల ప్రభుత్వాలున్నాయని చెప్పిన ఆయన కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడని చెప్పారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

రైతు ఆత్మహత్యల పాపం కాంగ్రెస్, టీడీపీలదే: ప్రొ. సీతారాంనాయక్

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

సంఘటితంగా, సమైక్య స్ఫూర్తితో స్త్రీనిధిని నిర్వహిస్తున్న మహిళల జీవితాలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 4.20 లక్షల సంఘాలకు చెందిన 60 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు అందిస్తున్న స్త్రీనిధి బ్యాంకు పేద మహిళల పాలిట పెన్నిధి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల గ్రామాలు, 438 మండలాలు, 9 జిల్లా శాఖలను కలిగిన స్త్రీనిధి రాష్ట్రంలోని 4.20 లక్షల సమభావన సంఘాల్లోని 60లక్షల మంది మహిళలకు సేవలందించడం అభినందనీయమన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఉచ్చులో చిక్కుకొని ఇబ్బందులకు గురవుతున్న పేద మహిళలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన స్త్రీనిధి పేదలకు పెన్నిధిగా నిలిచిందన్నారు.

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

2014-15 సంవత్సరంలో రూ.1700 కోట్లను మహిళా సంఘాలకు రుణాలుగా ఇచ్చి, తిరిగి వసూలుచేయడమే కాకుండా, రూ.705కోట్ల క్రెడిట్‌ప్లాన్‌ను సాధించిన స్త్రీనిధి బ్యాంకు పాలకవర్గాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. 2015-16 సంవత్సరానికి రూ.1050 కోట్లతో వార్షిక ప్రణాళిక రూపొందించుకున్న స్త్రీనిధి పాలకవర్గం లక్ష్యాన్ని రూ.1500కోట్లు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

సేవింగ్స్‌ను మరింత పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. స్త్రీనిధి బ్యాంకులో రూ.164కోట్ల మూలధనం కల్గి ఉండటం గొప్ప విషయం అన్నారు. అవసరం లేకుండా అప్పులు చేయరాదని మహిళలకు మంత్రి కేటీఆర్ ఉద్బోధించారు. స్త్రీనిధి బ్యాంకు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నదని మంత్రి కేటీఆర్ అభినందించారు.

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

సూక్ష్మరుణాలు ఉపయోగించుకొని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా అందించే రుణాలను జీవనోపాధుల మెరుగుదలకు ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. త్వరలో స్త్రీనిధి బ్యాంకును తెలంగాణ పల్లెప్రగతి పథకంతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 4.20 లక్షల మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు స్త్రీనిధి బ్యాంకు ద్వారా అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

'సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు, మహిళలకు వడ్డీలేని రుణాలు'

గత ఏడాది జీవనోపాధి కల్పన కింద వ్యవసాయ శాఖ నుంచి స్వయం సహాయక సంఘాలకు చెందిన 5,421 మంది మహిళలకు పాడి గేదెలను అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 150 వెనుకబడిన మండలాల్లో అమలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద మహిళల జీవనోపాధిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు.

ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని, రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ టీడీపీలదేనని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రొ. సీతారాంనాయక్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌కు మిర్చి రీసెర్చ్ సెంటర్, పసుపు బోర్డు, హార్టికల్చర్ యూనివర్సిటీ తెచ్చి తీరుతామన్నారు.

కాంగ్రెస్ నాయకులు వీటి గురించి ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని వరంగల్‌ లోక్‌సభ‌కు వస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నిక కోసమే కాంగ్రెస్, నేతల హడావిడి అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుప్పి గంతులు వేసినా వరంగల్ విజయం టీఆర్‌ఎస్ పార్టీనే వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

English summary
ktr says govt provide interest free loans for women groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X