ఎవనిదిరా కుట్ర - కేటీఆర్ సంచలనం..!!
సీఎం రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ అరెస్ట్ వార్తల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ పై విచారణకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. ఇటు లగచర్ల కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించారు. దీంతో, కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనంగా మారింది.
కేటీఆర్ చేసిన ట్వీట్ లో.. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో...రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.

ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?
— KTR (@KTRBRS) November 14, 2024
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి,…
దీనికి కొనసాగింపుగా 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!! అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications