వాటర్ గ్రిడ్ కోసం ఆదివారాలు కూడా పనిచేస్తున్నారు: కెటిఆర్

హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ కోసం అధికారులు ఆదివారాలు కూడా పనిచేయడం అభినందనీయమని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కెటి రామారావు అన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ఇంటింటికీ మంచినీరు అందిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలోని హోటల్ గోల్కొండలో వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌ను మంత్రి శనివారంనాడు ప్రారంభించారు.

హైదరాబాద్ నగరంలోని నీటి సరఫరా విషయంలో వాటర్‌గ్రిడ్ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి హడ్కోలాంటి సంస్థలు ముందుకొచ్చాయని, రక్షిత మంచినీరు ప్రాథమిక హక్కుగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన చెప్పారు.

 KTR says sundays are also working for water grid

మూడేళ్లలో రాష్ట్రంలోని ఇంటింటికీ మంచినీరు అందిస్తామని, 85 లక్షల ఇళ్లకు నల్లా నీరు సరఫరా చేయడమే లక్ష్యమని అన్నారు. వాటర్‌గ్రిడ్ పనుల్లో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేన్ అడ్వాన్స్‌ల విధానం తొలగించామని చెప్పారు.

గతంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో అంతులేని అవినీతి జరిగిందనిస పారదర్శకతకు పెద్దపీట వేసేందుకే ప్రభుత్వం సంకల్పించిందని కెటిఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగమే డీపీఆర్‌ను తయారు చేసిందని, డీపీఆర్‌ను వ్యాప్కోకు అప్పగించి పారదర్శకంగా పనిచేస్తున్నమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+