వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో నాకూ అసంతృప్తి!: కేసీఆర్ కీలక స్కీంపై కేటీఆర్ సంచలనం

|
Google Oneindia TeluguNews

సిరిసిల్ల/వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు, ఐటీ మంత్రి (ఆపద్ధర్మ) మంత్రి కేటీ రామారావు డబుల్ బెడ్రూం ఇళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పారని, కానీ ఆ హామీని నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు.

<strong>నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!</strong>నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!

డబుల్ బెడ్రూం ఇళ్లు దాదాపు ఎక్కడా పూర్తి కాలేదు. వాటిని ఆశించి దరఖాస్తు చేసుకున్న వారు కూడా నిరాశతో ఉన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రచారంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. యన వికారాబాద్, సిరిసిల్లలలో జరిగిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

డబుల్ బెడ్రూం ఇళ్లపై కేటీఆర్ అసంతృప్తి

డబుల్ బెడ్రూం ఇళ్లపై కేటీఆర్ అసంతృప్తి

డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో తనకు కూడా అసంతృప్తి ఉందని కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేనమామ కూడా పెళ్లి చేయడానికి ముందుకు రావడం లేదని, కానీ కేసీఆర్ మాత్రం నేను ఉన్నానని ముందుకు వచ్చారని, పేదింటి పిల్ల పెళ్లయితే రూ.లక్ష ఇస్తున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో పురుగుల అన్నం పెట్టారని, కానీ తాము సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు.

ఈసారి రూ.5 లక్షలు ఇస్తాం

ఈసారి రూ.5 లక్షలు ఇస్తాం

అన్ని పనులను బాగా చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. కానీ పేదలకు ఇచ్చే డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో తనకూ సంతృప్తి లేదని చెప్పారు. అందుకు కారణం కూడా ఉందని చెప్పారు. స్థలం దొరకడం లేదని, కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదన్నారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ అద్భుత పథకాలుగా భావిస్తున్న దానిలో డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఉన్నాయి.

 డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేదాకా ఊరుకునేది లేదు

డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేదాకా ఊరుకునేది లేదు

తాము ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో పనులు చేశామని, అలాంటిది డబుల్ బెడ్రూం ఎందుకు వదిలేస్తామని కేటీఆర్ అన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చేదాకా నేను ఊరుకునేది లేదని, ఆడపిల్ల రుణం తీర్చేదాకా వదిలి పెట్టనని చెప్పారు. టీడీపీ-కాంగ్రెస్‌ కలుస్తాయని ఎన్నడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను బొందలో పెట్టేందుకే ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, అలాంటిది చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్‌ తోక పార్టీ చేశారన్నారు. మహాకూటమి అంటూ ఐదు పార్టీల జెండాలు కప్పుకుని ఆ పార్టీల నాయకులు ఓట్ల కోసం తిరుగుతున్నారని, జనాలు అప్పుడే సంక్రాంతి పండగకు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారన్నారు.

 రజనీకాంత్ సినిమాలో చెప్పినట్లు

రజనీకాంత్ సినిమాలో చెప్పినట్లు

సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమాలో చెప్పినట్లు సింహం సింగిల్‌గా వస్తుందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ కూడా సింహంలా సింగిల్‌గా వస్తున్నారని, వారు గుంపులుగా వస్తున్నారని చెప్పారు. చంద్రబాబును తన భుజాలపై మోసుకొని వస్తోందని ఆరోపించారు. డిసెంబర్ 11వ తేదీ తర్వాత పింఛన్లు రెట్టింపు అవుతాయని చెప్పారు. పింఛన్ల వయో పరిమితిని 58 ఏళ్లకు తగ్గిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ కనీసం 9 గంటల విద్యుత్ ఇచ్చిందా అని ప్రశ్నించారు.

English summary
Telangana IT minister KT Rama rao shocking comments on double bed room houses. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly. The incumbent Telangana Rashtra Samithi, the Indian National Congress, Telangana Jana Samithi, and Telugu Desam Party are considered to be the main contestants in the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X